Airtel plans updates: ఎయిర్‌టెల్ ఆ మూడు ప్లాన్లతో ఇక అమెజాన్ ప్రైమ్ వీడియో ఉచితం
Airtel plans updates: ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్, ప్రముఖ టెలీకం కంపెనీ ఎయిర్‌టెల్ కొత్తగా మూడు ప్రీపెయిడ్ ప్లాన్లను అప్‌డేట్ చేసింది. ఈ ప్లాన్స్ తీసుకుంటే ఇక నుంచి అమెజాన్ ప్రైమ్ ఉచితం మరి.
ఎయిర్‌టెల్ కంపెనీ యూజర్లకు శుభవార్త. ఇప్పుడు ఎయిర్‌టెల్ కంపెనీ తన ప్లాన్లను అప్‌డేట్ చేసింది. ముఖ్యంగా మూడు ప్లాన్లకు అమెజాన్ ప్రైమ్ వీడియోను ఉచితంగా చేర్చడంతో ఆ ప్లాన్లు ఆకట్టుకుంటున్నాయి.
ప్రముఖ టెలీకం కంపెనీ ఎయిర్‌టెల్ కస్టమర్లకు తీపి కబురు అందించింది. మూడు ప్రీ పెయిడ్ ప్లాన్లకు అదనంగా అమెజాన్ ప్రైమ్ చేర్చింది. ఇక నుంచి ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్స్‌లోని 699,999,3359 రూపాయల ప్లాన్స్‌తో అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభించనుంది. 2,999 రూపాయల ప్లాన్ విషయంలో మాత్రం కస్టమర్లకు షాక్ ఇచ్చింది.
ఎయిర్‌టెల్ 699 ప్లాన్ తీసుకుంటే రోజుకు 3 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. వ్యాలిడిటీ 56 రోజులుగా ఉంటుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ మొబైల్ ప్యాక్, వింక్ మ్యూజిక్ లాంటి ప్రయోజనాలు కలుగుతాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో సభ్యత్వం కూడా యూజర్లు ఉచితంగా పొందవచ్చు.
ఎయిర్‌టెల్ 999 రూపాయల ప్లాన్ తీసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు 2.5 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ అదనంగా లభిస్తుంది.
ఇక ఎయిర్‌టెల్ 3359 ప్రీ పెయిడ్ ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు 2.5 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు వంద ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. వింక్ మ్యూజిక్, ఉచిత హలో ట్యూన్ ఉండనే ఉంటాయి. ఇవి కాకుండా రెండు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఉచితంగా లభిస్తాయి. ఏడాదిపాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో ఉచితంగా అందుతాయి.
ఇక ఎయిర్‌టెల్ 2999 ప్లాన్‌లో 365 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు వంద ఎస్ఎంఎస్‌లు ఎలానూ ఉంటాయి. ఉచిత హలో ట్యూన్, వింక్ మ్యూజిక్ ప్రయోజనాలుంటాయి. అయితే ఈ ప్లాన్‌లో ఇప్పటివరకూ ఉన్న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ను తీసేసింది.
Also read: Indigo Airlines: దేశంలో ఎక్కడికైనా..కేవలం 2218 రూపాయలకే ప్రయాణం, ఇండిగో పరిమిత సీట్ల ఆఫర్, త్వరపడండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook