Indigo Airlines: దేశంలో ఎక్కడికైనా..కేవలం 2218 రూపాయలకే ప్రయాణం, ఇండిగో పరిమిత సీట్ల ఆఫర్, త్వరపడండి

Indigo Airlines: అతి తక్కువ ధరకు విమానయానం చేయాలనుంటే..ఇదే మంచి అవకాశం. వెంటనే టికెట్ బుక్ చేసుకోండి. దేశంలో ఎక్కడికైనా సరే అత్యంత తక్కువ ధరకే వెళ్లే అవకాశం. ఆ వివరాలు మీ కోసం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 4, 2022, 04:52 PM IST
Indigo Airlines: దేశంలో ఎక్కడికైనా..కేవలం 2218 రూపాయలకే ప్రయాణం, ఇండిగో పరిమిత సీట్ల ఆఫర్, త్వరపడండి

ఇండిగో ఎయిర్‌‌లైన్స్ వింటర్ సేల్ ప్రవేశపెట్టింది. ఈ సేల్‌లో భాగంగా దేశంలో ఎక్కడికైనా సరే కేవలం 2218 రూపాయలు వెళ్లవచ్చు. ఈ ఆఫర్ మరో రెండ్రోజుల్లో ముగుస్తోంది. త్వరపడండి మరి.

ఇండిగో ఎయిర్‌లైన్స్ అందిస్తున్న ఈ వింటర్ సేల్ ఆఫర్ డిసెంబర్ 1న ప్రారంభమైంది. డిసెంబర్ 6 వరకూ బుకింగ్స్ నడుస్తాయి. దేశంలో ఎక్కడికైనా రానున్న రోజుల్లో వెళ్లేందుకు ఈ ఆరు రోజుల్లో టికెట్ బుక్ చేసుకుంటే ప్రత్యేక డిస్కౌంట్ ధర అందిస్తోంది. దేశంలో ఎక్కడికైనా సరే కేవలం 2218 రూపాయలు వెళ్లవచ్చు. ఈ వారం రోజుల్లో బుక్ చేసుకుంటే..జనవరి 10 నుంచి ఏప్రిల్ 13 మద్యకాలంలో వెళ్లవచ్చు. అంటే సంక్రాంతి లేదా వేసవి సెలవుల్లో మీ ప్రయాణం చేయవచ్చు.

ఇండిగో అందిస్తున్న ఈ వింటర్ సేల్ బుకింగ్ మరో రెండ్రోజులే మిగిలుంది. అంటే డిసెంబర్ 6లోగా టికెట్ బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ విండో ప్రస్తుతానికి ఓపెన్ అయుంది. ఈ ఆఫర్ ప్రకారం జనవరి 10 నుంచి ఏప్రిల్ 13 మధ్య కాలంలో ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు. టికెట్ మాత్రం ఈ రెండ్రోజుల్లో బుక్ చేసుకోవల్సి వస్తుంది. 

ఇది లిమిటెడ్ సీట్ ఆఫర్. అంటే కొద్దిసీట్లే ఈ ఆఫర్‌లో వర్తిస్తాయి. ముందుగా బుకింగ్ చేసుకుంటే ఈ ఆఫర్ మీకు వర్తించే అవకాశముంది. ఇండిగో అందిస్తున్న ఈ ఆఫర్‌లో ట్యాక్స్, ఎయిర్‌పోర్ట్ ఛార్జ్ అదనం. ఈ ఆఫర్‌లో నాన్‌స్టాప్ ఫ్లైట్స్ కూడా ఉన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లవచ్చు.

ఇండిగో అందిస్తున్న వింటర్ సేల్ ఆఫర్‌లో గ్రూప్ బుకింగ్‌కు అనుమతి లేదు. కేవలం వ్యక్తిగత టికెట్లే ఉన్నాయి. టికెట్ బుక్ చేసుకున్న తరువాత దీనిని క్యాష్ లేదా ఎక్స్చేంజ్‌లో మార్చేందుకు వీల్లేదు. మీ ప్రయాణంలో మార్పుంటే..కన్వర్షన్ ఛార్జెస్ చెల్లించి మార్చుకోవచ్చు.

ఈ ఆఫర్ ప్రకారం goindigo.in అధికారిక వెబ్‌సైట్ నుంచి టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఇతర మార్గాల ద్వారా కూడా ఆఫర్ ప్రైస్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఏ విధమైన ముందస్తు సమాచారం లేకుండా ఇండిగో సంస్థ ఈ ఆఫర్‌ను తీసేయవచ్చు. 

Also read: Fuel Price Cut Down: రేపు డిసెంబర్ 5 నుంచి తగ్గనున్న పెట్రోల్-డీజిల్ ధరలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News