Cryptocurrency: క్రిప్టోకరెన్సీ విలువ క్షీణిస్తోంది. రష్యాలో క్రిప్టోకరెన్సీని నిషేధించే ఆలోచనల నేపధ్యంలో క్రిప్టో కాయిన్ల ధర ఒక్కసారిగా క్షీణించడం ప్రారంభమైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రష్యా దేశపు సెంట్రల్ బ్యాంక్ ప్రకటన క్రిప్టోకరెన్సీపై గణనీయ ప్రభావం చూపిస్తోంది. రష్యా ప్రభుత్వం క్రిప్టోకరెన్సీను నిషేధించాలని..అసాంఘిక కార్యకలాపాల్లో క్రిప్టోకరెన్సీ వినియోగం ఎక్కువైందని సెంట్రల్ బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో నెలకొన్న ఆర్ధిక పరిస్థితుల కారణంగా ఆయిల్ ధరల్లో పెరుగుదల, ద్రవ్యోల్బణం పెరగడం, టెక్నాలజీ మార్కెట్‌లో క్షీణత చోటుచేసుకుంది. 


టెర్రా, డాలర్‌లో పోలిస్తే..టాప్ 10లోని 7 డిజిటల్ కాయిన్లు తక్కువ ధరకు ట్రేడ్ అయ్యాయి. ప్రపంచ క్రిప్టోమార్కెట్ 1.87 ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది. మొత్తంగా చూసుకుంటే 11 శాతం తగ్గి..66.73 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక బిట్‌కాయిన్ (Bitcoin) మరోసారి క్షీణించి 40 వేల డాలర్ల కంటే తక్కువకు ట్రేడ్ అయింది. అటు ఎథిరియమ్ అయితే 3 వేల డాలర్ల కంటే తక్కువకు పడిపోయింది. ఇవే కాకుండా టాప్ 20 డిజిటల్ కాయిన్లన్నీ రెడ్ మార్క్‌లో ట్రేడ్ అవుతున్నాయి.


భారతీయ క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారులు, సంస్థలు రానున్న బడ్జెట్‌లో విధించబోయే విధి విధానాలు, టాక్సేషన్ నిబంధనల కోసం నిరీక్షిస్తున్నాయి. ఇండియా మాత్రం క్రిప్టో ఆస్థులపై 30-40 శాతం వరకూ భారీగా ట్యాక్స్ విధించవచ్చని తెలుస్తోంది. ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టో మార్కెట్ కలిగిన రష్యా..క్రిప్టోకరెన్సీని (Cryptocurrency) నిషేధించేందుకు యోచిస్తోంది. రష్యా చేసిన ఈ నిషేధ ప్రకటన డిజిటల్ మార్కెట్‌ను రెడ్ మార్క్‌లోకి నెట్టేసింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు విధిస్తున్న నిషేదాజ్ఞలు, ఆంక్షలు, రెగ్యులేటరీ నిఘా కారణంగా క్రిప్టో పరిశ్రమ అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటోంది. 


క్రిప్టో విలువ పడిపోతుండటం పెట్టుబడిదారుల్ని సందిగ్దంలో పడేస్తోంది. ప్రముఖమైన క్రిప్టో కరెన్సీ కాయిన్ల విలువ పడిపోవడమనేది ద్రవ్యోల్బణం, డిమాండ్ లోపించడంపై ఆధారపడి ఉంది. వచ్చేవారం క్రిప్టోకరెన్సీకు కీలకంగా మారనుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 


యూఎస్ డాలర్‌కు ( Us Dollar) అధికారిక డిజిటల్ వెర్షన్ సృష్టించడమనేది అమెరికన్లకు లాభం చేకూర్చనుంది. పేమెంట్ ఆప్షన్స్ మరింత సులభతరం చేయనుంది. అయితే ఆర్ధిక పరమైన స్థిరత్వం, ప్రైవసీ ముప్పు పొంచి ఉన్నాయనే ఆందోళన కన్పిస్తోంది. మరోవైపు ఈ మార్కెట్‌పై హ్యాకర్ల బెడద కూడా కొనసాగుతోంది. హ్యాకర్లు దాదాపుగా 3 బిలియన్ డాలర్ల క్రిప్టోకరెన్సీను దొంగిలించేశారని సమాచారం. అటు రాబిన్ హుడ్ మార్కెట్స్ ఇన్‌కార్పొరేషన్ సంస్థ ఇప్పటి క్రిప్టోవాలెట్లను వేయిమంది యూజర్లకు పరిమితం చేసేసింది. 


Also read: Todays Gold Rate: భారీగా పెరిగిన బంగారం ధర, దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook