Gold Price Today In India: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు, వెండి భారీగా పతనం
Gold Price Today In India: హైదరాబాద్ (Gold Price Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. తాజాగా మార్కెట్‌లో వెండి ధర మరోసారి భారీగా పతనమైంది.
బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) వరుసగా మూడోరోజు స్వల్పంగా దిగొచ్చాయి. మరోవైపు మార్కెట్‌లో వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. హైదరాబాద్ (Gold Price Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.50 మేర స్వల్పంగా తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,740 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,310కి పతనమైంది.
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate in Delhi) స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా బంగారం ధరలలో ఎలాంటి మార్పులేకపోవడంతో నిన్నటి ధరలతో కొనసాగుతున్నాయి. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,730 వద్ద మార్కెట్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారంపై నిన్న రూ.300 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.49,250కి దిగిరాగా, నేడు అదే ధర వద్ద ఉంది.
గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్‌లో భారీగా పెరిగిన వెండి ధరలు (Silver Rate in India) మూడోరోజు దిగొచ్చాయి. తాజాగా వెండి ధర రూ.1,000 మేర తగ్గింది. దీంతో ప్రస్తుతం 1 కేజీ వెండి ధర రూ.61,000కి క్షీణించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe