Credit Card Benefits: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? ఈ ఐదు ప్రయోజనాల గురించి తప్పక తెలుసుకోండి
How To Use Credit Card: మీరు క్రెడిట్ కార్డు వినియోగదారులా..? ఎలా ఉపయోగించాలో తెలియక బిల్లులు చెల్లించలేక సతమతం అవుతున్నారా..? అయితే క్రెడిట్ కార్డును సరైన పద్ధతిలో ఉపయోగిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఏడాదిలో మీరు ఎంతో లాభం పొందొచ్చు.
How To Use Credit Card: ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగిపోయింది. అయితే క్రెడిట్ కార్డును చక్కగా వినియోగించుకుంటే అన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఒక్కతేడా కొట్టిందంటే క్రెడిట్ కార్డు ఎందుకు తీసుకున్నారం బాబు అనేలా ఉంటుంది. అనవసర ఖర్చులకు ఉపయోగించుకుని.. తరువాత బిల్లులు కట్టేందుకు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మీరు కూడా ఇప్పటికే క్రెడిట్ కార్డు వినియోగిస్తున్నట్లయితే.. కార్డు బెనిఫిట్స్ కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. క్రెడిట్ కార్డ్ వల్ల చాలామందికి తెలియని అనేక ప్రయోజనాలు ఉన్నాయి. క్రెడిట్ కార్డు ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
క్రెడిట్ స్కోరు పెరుగుతుంది
మీరు లోన్ తీసుకోవడానికి వెళితే.. కచ్చితంగా క్రెడిట్ స్కోరు చూస్తారు. క్రెడిట్ కార్డ్ కూడా ఒక రకమైన లోన్. కార్డును ఎంత ఎక్కువగా వినియోగిస్తే.. మీ క్రెడిట్ స్కోరు అంత పెరుగుతుంది. సరైన టైమ్ బిల్ పేమెంట్ చేసుకుంటే వెళితే.. మీ క్రెడిట్ స్కోరుతో లోన్ ఈజీగా వస్తుంది.
ఎలాంటి వడ్డీ లేకుండా..
మీరు క్రెడిట్ కార్డును వినియోగించిన వెంటనే తిరిగి కార్డుకు డబ్బులకు చెల్లించాల్సిన పనిలేదు. 30 నుంచి 45 రోజుల మధ్య బిల్ జనరేట్ అయిన తరువాత చెల్లించవచ్చు. డ్యూడేట్‌లోపు చెల్లిస్తే ఎలాంటి వడ్డీ ఉండదు.
భారీగా ఆఫర్లు..
మీరు ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులు అయితే.. క్రెడిట్ కార్డు ద్వారా భారీ ఆఫర్లు పొందొచ్చు. కొన్ని కార్డులపై 10 నుంచి 15 శాతం వరకు ఆఫర్లు ఉంటాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్‌తోపాటు క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా ఉంటాయి. అంతేకాకుండా రివార్డ్ పాయింట్లు కూడా పొందుతారు.
ఈఎంఐ సౌకర్యం
మీరు షాపింగ్ చేసిన బిల్లును ఈఎంఐ రూపంలో కూడా చెల్లించవచ్చు. మీరు ఎంత చెల్లించారో ఆ బిల్లును EMIగా మార్చుకోవచ్చు. వినియోగదారులకు క్రెడిట్ కార్డ్‌పై నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యాన్ని కూడా పొందుతారు.
ఎమర్జెన్సీ టైమ్‌లో..
ఒక్కోసారి అనుకోని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు చేతిలో డబ్బులేకపోతే క్రెడిట్ కార్డు ఎంతో ఉపయోగపడుతుంది. ఆ డబ్బులను మీరు బిల్ జనరేట్ అయిన తరువాత చెల్లించవచ్చు.
Also Read: Chandrababu Case Updates: క్వాష్ పిటీషన్‌పై చంద్రబాబుకు ఊరట, రేపు విచారణకు లిస్టింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి