Saffron Cultivation: ఈ పువ్వు ధర కిలో 3 లక్షలపైనే.. ఇంతకీ ఇదేంటో తెలుసా ?
Why Saffron Price Is So Expensive And How It Is Cultivated : సుగంధ ద్రవ్యాలు, కొన్ని రకాల మసాలా దినుసులకు ప్రపంచంలోనే భారత్‌కి మంచి పేరున్న విషయం తెలిసిందే. ఇక్కడి నుంచే పలు రకాల సుగంధ ద్రవ్యాలు ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. అలాంటి వాటిలో ఒకటి మన ఇండియాలో ఒక రాష్ట్రానికి చెందిన రైతులకు కాసుల పంట పండిస్తోంది.
Why Saffron Price Is So Expensive And How It Is Cultivated : సుగంధ ద్రవ్యాలు, కొన్ని రకాల మసాలా దినుసులకు ప్రపంచంలోనే భారత్‌కి మంచి పేరున్న విషయం తెలిసిందే. ఇక్కడి నుంచే పలు రకాల సుగంధ ద్రవ్యాలు ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. అలాంటి వాటిలో ఒకటి మన కశ్మీర్ కుంకుమ పువ్వు. కశ్మీర్ వాసులకు వ్యవసాయంలో ఇది వారసత్వ సంపద మాత్రమే కాదు.. మన భారతీయుల సంస్కృతి, సంప్రదాయం, ఆచార వ్యవహారాలు, అలవాట్లలో అతి కీలకమైనదిగానూ ప్రత్యేకత సంపాదించుకుంది. కశ్మీర్ ఆర్థిక వ్యవస్థలో అక్కడి వారికి అధిక రాబడిని ఇచ్చే పంటల్లో అన్నింటికంటే ముందు ఉంటుంది ఈ కుంకుమ పువ్వు సాగు. అవును కశ్మీర్ వాసుల పంట పండిస్తోంది ఈ కుంకుమ పువ్వే.
ఇటీవల కాలంలో కుంకుమ పువ్వు ధరలు కూడా భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఈమధ్య కాలంలో.. అంటే ఎప్పుడైతే కుంకుమ పువ్వుకు జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లభించిందో.. అప్పటి నుంచే కుంకుమ పువ్వు ధరలు 64 శాతం పెరిగాయి. దీంతో కుంకుమ పువ్వు ధరలు ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. కాశ్మీరీ కుంకుమ పువ్వు గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే... ఇప్పుడు మన దేశంలో పండించి, అత్యంత అధిక ధరకు అమ్ముకునే ఖరీదైన పంట ఏదైనా ఉందా అంటే అందులో ఈ కుంకుమ పువ్వు ముందు వరుసలో ఉంటుందని చెప్పుకోవచ్చు. అందుకే మన దగ్గర పత్తి పంటను తెల్ల బంగారం అని ఎలాగైతే పిలుస్తారో... అలాగే ఈ కుంకుమ పువ్వు పంటను కాశ్మీర్ వాసులు కూడా ఎర్ర బంగారం అవి పిలుచుకుంటుంటారు.
కాశ్మీరీ కుంకుమ పువ్వుకి దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ఖరీదు పలుకుతున్నప్పటికీ.. కాశ్మీర్‌లో అశాంతి నెలకొనడం, దేశవ్యాప్తంగా సరైన పంపిణీ లేకపోవడం వంటి కారణాల వల్ల గతంలో చాలాకాలంపాటు కుంకుమ పువ్వు ధరలు క్షీణిస్తూ వచ్చినప్పటికీ.. ఇటీవల కాలంలో కశ్మీర్‌లో పరిస్థితులు మారడంతో ఈ ఎర్ర బంగారం కాశ్మీర్ వాసులకు కాసుల పంట పండిస్తోంది.
కాశ్మీరీ కుంకుమ పువ్వుకు జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లభించినప్పటి నుండి వీటి ధరలు అమాంతంగా పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం 10 గ్రాముల కాశ్మీరీ కుంకుమ పువ్వు ధర 3200 రూపాయలు పలుకుతోంది. 1 కిలో కుంకుమ పువ్వు ధర రూ. 3 లక్షలకు పై చిలుకు పలుకుతోంది. అంటే ఇండియాలో కిలో వెండి ధర రూ. 75 వేల నుంచి 80 వేల మధ్య ఊగిసలాడుతుండగా.. కుంకుమ పువ్వు అంతకంటే కనీసం నాలుగు రెట్లు ఎక్కువే పలుకుతోంది.
జాగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లేనప్పటికీ కుంకుమ పువ్వుని ఖరీదైన పంటగానే పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే కాశ్మీర్ కుంకుమ పువ్వు ధరలు పెరగడానికి జిఐ ట్యాగింగ్ కాకుండా మరొక కారణం ఈ పంటను పండించే విధానం అత్యంత కఠినమైన ప్రక్రియ కావడమే. ఒక్కో పువ్వులో 3 నుండి 4 కుంకుమ పువ్వు ఖండాలు మాత్రమే ఉంటాయి. అంటే 1 కిలోల కుంకుమ పువ్వు ఉత్పత్తి చేయడానికి కనీసం ఎంత లేదన్నా 1.5 లక్షలకు పైగా పూలు అవసరం అవుతాయి.
కుంకుమ పువ్వుకు అంత ఖరీదు ఎందుకంటే.. ఒకటి పంట సాగు ప్రక్రియ అతి క్లిష్టమైనది కాగా.. రెండోది దాదాపు లక్షన్నర పూలు పండిస్తే అందులోంచి ఒక కిలో కుంకుమ పువ్వు ఉత్పత్తి అవుతుంది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే.. ఈ కుంకుమ పువ్వు పంట అన్ని పంటల మాదిరిగా ఏడాది పొడవునా పండించడానికి వీలు ఉండదు. ఎందుకంటే సంవత్సరంలో కేవలం 6 వారాలు మాత్రమే ఈ కుంకుమ పూవులు వికసిస్తాయి. మిగతా సమయాల్లో అక్కడి వాతావరణం పరిస్థితుల కారణంగా కుంకుమ పువ్వును పండించడం కుదరదు. అందువల్లే కుంకుమ పువ్వుకు అంత ఎక్కువ ధర.
ఇది కూడా చదవండి : How To Earn More Money: చిన్న వయస్సులోనే ఎక్కువ డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి