Richest Living King In World: ఒక సామాన్యుడికి జీవితంలో ఒక్కసారయినా విమానం ఎక్కాలన్న కల జీవితాంతం కలగానే మిగిలిపోతోంది. కానీ అతడి వద్ద కనీసంలో కనీసం 38 విమానాలు ఉన్నాయి. కనీసం నీళ్లలో ఉన్న పడవ ఎక్కాలన్నా ఆ కల కూడా తీరని వాళ్లుంటారు. కానీ అతడి వద్ద మామూలు బోట్ కాదు.. ఏకంగా 52 బంగారు పడవలే ఉన్నాయి.. ఒక లగ్జరీ కారును దూరంగా చూసే మురిసిపోయే పేదోళ్లున్న దేశం మనది.. కానీ అతడి వద్ద ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 300 వరకు కార్లు ఉన్నాయి. అన్నీ కూడా లగ్జరీ కార్లే. ఇంతకీ మనం చెప్పుకుంటున్న ఈ అపర కుబేరుడు ఎవరో తెలుసా ? థాయ్ లాండ్ లో ఇప్పటికీ ఉన్న రాజ వంశీయులలో అత్యంత ధనికుడైన కింగ్ మహా వజిరాలాంగ్కార్న్ గురించి.
బిజినెస్ లాంగ్వెజ్‌లో చెప్పాలంటే కింగ్ మహా వజిరాలాంగ్‌కాన్ నెట్‌వర్త్ 40 బిలియన్ అమెరికన్ డాలర్లు. అంటే మన భారతీయ కరెన్సీలో రూ. 3.2 లక్షల కోట్లు అన్నమాట. కింగ్ మహా వజిరాలాంగ్‌కాన్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తులలో ఒకరు మాత్రమే కాదు.. అత్యంత ధనిక రాజకుటుంబీకుడు కూడా.
ఫినాన్షియల్ టైమ్స్ ప్రచురించిన ఓ కథనం ప్రకారం, థాయిలాండ్‌ని పాలించే చక్రవర్తిగా పేరున్న వజిరాలాంగ్‌కాన్ వద్ద ఉన్న ఖరీదైన, విలువైన రియల్ ఎస్టేట్ ఆస్తులు ప్రపంచంలో మరెవరి వద్దా లేవు. ఈ కింగ్ కాన్ కి 16,210 ఎకరాల భూమి ఉంది. ఈ రాజు పేరిట ఉన్న భూముల్లోనే అక్కడి అధికార యంత్రాంగం పనిచేస్తోన్న అనేక ప్రభుత్వ భవనాలు, షాపింగ్ మాల్స్, హోటల్స్, ఇతర సంస్థలు కూడా ఉన్నాయి. ఈ రాజు వద్ద ఉన్న ఆస్తుల పోర్ట్‌ఫోలియో కూడా అంతే వైవిధ్యంగా ఉంది.
పేరొందిన సంస్థల్లో రాయల్ ఫ్యామిలీ ఇన్వెస్ట్మెంట్స్ :
కింగ్ మహా వజిరాలాంగ్‌కాన్ థాయ్‌లాండ్ చక్రవర్తి మాత్రమే కాదు.. ఆ దేశంలో పేరున్న సంస్థల్లో పెట్టుబడులు పెట్టి దేశ ఆర్థిక దిశ, దశని మార్చడంలో తన వంతు పాత్ర పోషిస్తున్న బిజినెస్‌మేన్. ఎన్నో పరిశ్రమలతో పాటు సియామ్ కమర్షియల్ బ్యాంక్‌లో 23% వాటాలు, సియామ్ సిమెంట్ గ్రూప్‌లో 33.3% వాటాలు ఉన్నాయి.
ఛక్రవర్తి నిధుల ఖజానా
కింగ్ మహా వజిరాలాంగ్‌కాన్ వద్ద ఉన్న నిధి నిక్షేపాల జాబితాలో 545.67 క్యారెట్ల బ్రౌన్ గోల్డెన్ జూబ్లీ డైమండ్ కూడా ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వజ్రంగా దీనికి పేరుంది. ఈ డైమండ్ విలువ సుమారు రూ. 98 కోట్లు.
కింగ్ మహా వజిరాలాంగ్కార్న్ వద్ద హెలికాప్టర్లు, బోయింగ్ విమానాలు, ఎయిర్‌బస్‌లు, సుఖోయ్ సూపర్‌జెట్ యుద్ధ విమానాలు అన్నీ కలిపి మొత్తం 38 విమానాలు ఉన్నాయి. వాటికి అవసరమైన ఫ్యూయెల్, నిర్వహణ ఖర్చుల కోసమే ప్రతీ సంవత్సరం రూ. 524 కోట్లు వెచ్చిస్తున్నారంటే వాటి వినియోగం ఏ రేంజులో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి : How To Earn More Money: చిన్న వయస్సులోనే ఎక్కువ డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలో తెలుసా ?
ఈ కింగ్ ఎంత గొప్పోడంటే..
ఈ కింగ్‌కి 23,51,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో లగ్జరీ ప్యాలెస్ ఉంది. కానీ ఈ రాజు గొప్పతనం ఏంటంటే... ఆయన అక్కడ ఉండటానికి ఇష్టపడడు.. ఆ రాజ భవనాన్ని అధికారిక అవసరాల కోసం ప్రభుత్వ కార్యాలయాలు, మ్యూజియంల కోసం అంకితం ఇచ్చేశాడు. అంటే చేతిలో అధికారం ఉందనో లేక భారీగా డబ్బు ఉంది కదా అనో విర్రవీగే చాలామందిలో ఉండే అహం ఈ రాజులో లేదు.. పైగా మంచి మనసుంది. ఇంకా ఒక్క ముక్కలో చెప్పాలంటే మనసున్న మహారాజు అన్నమాట. సూపర్ కదా.. అధికారం చేతిలో ఉన్న వాడు ఇలా ఉంటే ఎవరైనా సూపర్ అని కీర్తించాల్సిందే మరి.
ఇది కూడా చదవండి : Tata Punch iCNG: టాటా పంచ్ iCNG కారు వచ్చేసింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి