Instagram New Features: ఇన్‌స్టాగ్రామ్‌ ఎప్పటికప్పడు కొత్త కొత్త ఫీచర్స్‌ను తీసుకొస్తూ ఉంటుంది. ఇక యూజర్స్‌ వారి పోస్ట్‌లు, కామెంట్స్, మరియు ఇతర ప్లాట్‌ఫారమ్ యాక్టివిటీని సులభంగా తొలగించేందుకు వీలుగా ఒక కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. సేఫర్ డే ఇనిషియేటివ్‌లో భాగంగా ఈ ఫీచర్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ఇక ఈ ఫీచర్‌లను యాక్సెస్ చేయడానికి వీలుగా.. యువర్ యాక్టివిటీ అనే ఫీచర్‌‌ను ప్రవేశపెట్టింది. యువర్ యాక్టివిటీ ట్యాబ్‌లోకి వెళ్తే ఈ ఆప్షన్స్ మొత్తం ఉంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్స్‌ వారి పోస్ట్‌లు, స్టోరీస్, ఐజీటీవీ, రీల్స్ వంటి కంటెంట్‌ను బల్క్‌గా తొలగించుకోవచ్చు లేదంటూ ఆర్కైవ్ చేయవచ్చు. అలాగే కామెంట్స్‌, లైక్‌లు, స్టోరీ స్టిక్కర్ రియాక్షన్స్ వంటి వాటిని కూడా తీసేయవచ్చు.


అలాగే మీరు ఇటీవల తొలగించిన లేదా ఆర్కైవ్ చేసిన కంటెంట్‌ను కనుగొనాలన్నా, మీ సెర్చ్‌ హిస్టరీ గురించి తెలుసుకోవాలన్నా, మీ సమాచారాన్ని డౌన్‌లోడ్ చేయాలన్నా ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది. 


ఇక ఇన్‌స్టాగ్రామ్‌ టేక్ ఏ బ్రేక్ అనే ఫీచర్‌‌ను కూడా తీసుకొచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో గంటల తరబడి ఉండిపోయే వారికి ఈ ఫీచర్‌‌ ఉపయోగపడుతోంది. ఇన్‌స్టా నుంచి కాసేపు బ్రేక్‌ తీసుకునేందుకు ఈ ఫీచర్‌‌ చాలా యూజ్ అవుతుంది. ఒక టైమ్‌ సెట్ చేసుకుని ఇన్‌స్టా నుండి బ్రేక్‌ తీసుకోవచ్చు. టేక్ ఏ బ్రేక్ ఫీచర్‌‌ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో మనం సెట్‌ చేసుకున్న టైమ్‌ తర్వాత బ్రేక్ తీసుకోండి అని గుర్తు చేస్తుంది ఈ ఆప్షన్.


బ్రేక్ తీసుకోవడానికి ఎంత టైమ్‌ తర్వాత రిమైండర్ రావాలనేది ముందుగానే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రకారం యూజర్‌‌కు రిమైండర్ వస్తుంది. యువర్ యాక్టివిటీ ఆప్షన్‌లో టైమ్ ట్యాబ్‌లో ఈ ఆప్షన్‌ ఉంటుంది.


Also Read: POCO M4 Pro 5G: పొకొ నుంచి మరో బడ్జెట్ 5జీ ఫోన్​- ధర, ఫీచర్లు ఇవే..!


Also Read: Flipkart TV Days: స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపు.. రూ.16,500లకే 50 అంగుళాల స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook