Amritha Aiyer: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఇన్‌స్టా అకౌంట్ హ్యాకింగ్.. పోలీసులకు ఫిర్యాదు!!

యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమాలో హీరోయిన్‌గా నటించిన అమృత అయ్యర్​ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్​ హ్యాక్​ అయింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 2, 2022, 03:43 PM IST
  • టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఇన్‌స్టా అకౌంట్ హ్యాకింగ్
  • అవును.. నా అకౌంట్​ హ్యాక్​ అయింది
  • పోలీసులకు ఫిర్యాదు
 Amritha Aiyer: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఇన్‌స్టా అకౌంట్ హ్యాకింగ్.. పోలీసులకు ఫిర్యాదు!!

Amritha Aiyer's Instagram Account hacked: ఇటీవలి కాలంలో ప్రముఖులకు చెందిన సోషల్ మీడియా ఖాతాలు తరచూ హ్యాకింగ్‌కు గురవుతున్న విషయం తెలిసిందే. కొందరు ఆకతాయిలు ఎక్కువగా రాజకీయ, సినీ రంగాలకు చెందిన వారి ఖాతాలను హ్యాక్ చేసి.. అసభ్యకరమైన పోస్టులు, కామెంట్లు, ఫొటోలు  పెడుతున్నారు. ఇటీవల స్టార్ హీరోయిన్స్ పూజా హెగ్డె, టబు, ఇషా డియోల్​, వరలక్ష్మీ శరత్​ కుమార్‌ల సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్‌కు గురైయ్యాయి. తాజాగా ఈ జాబితాలో టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అమృతా అయ్యర్ కూడా చేరారు.

యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమాలో హీరోయిన్‌గా నటించిన అమృత అయ్యర్​ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్​ హ్యాక్​ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విటర్​ ఖాతా ద్వారా తెలిపారు. తన అకౌంట్​ మళ్లీ తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. 'అవును.. నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేయబడింది. నా అకౌంట్​ మళ్లీ తిరిగి రావాలని ఆశిస్తున్నాను. త్వరలోనే మీ ముందుకు తిరిగి వస్తాను' అని అమృత అయ్యర్ ట్వీట్ చేశారు.  విషయంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన 'బిగిల్' సినిమాతో అమృత అయ్యర్ మంచి పేరు తెచ్చుకున్నారు. టీమ్ కెప్టెన్‌గా ఆకట్టుకున్న్నారు. ఆ తర్వాత ఎనర్జటిక్ హీరో రామ్ నటించిన 'రెడ్' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.  ఆపై యాంకర్ ప్రదీప్ మాచిరాజుతో కలిసి '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇక తాజాగా శ్రీ విష్ణుతో కలిసి 'అర్జున ఫాల్గుణ' సినిమాలో నటించి మెప్పించారు. 

Also Read: Indigo Vaxi Fare: విమాన ప్రయాణికులకు శుభవార్త.. ఇండిగో విమానాల్లో 10 శాతం డిస్కౌంట్!

Also Read: Andhra Pradesh Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే- కేంద్ర సహాయమంత్రి పార్లమెంట్ లో ప్రకటన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News