MS Dhoni Buys TVS Ronin Bike : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఖరీదైన లగ్జరీ కార్లు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ధోనీ వద్ద ఉన్న కలెక్షన్స్‌లో ఖరీదైన కార్లు మాత్రమే కాదు.. ఖరీదైన  బైక్స్ కూడా ఉన్నాయి. ఈమధ్యే మహేంద్ర సింగ్ ధోనీ ఓ కొత్త బైక్‌ను కొనుగోలు చేశాడు. ధోని కొన్నాడంటే అదేదో ఖరీదైన బైక్ అయ్యుంటుందని అనుకోవద్దు.. ఎందుకంటే ఈ బైక్ ధర కేవలం లక్షన్నర రూపాయల లోపే. అవును.. ధోనీ కొత్త టీవీఎస్ రోనిన్‌ బైక్ కొనుగోలు చేశాడు. టివిఎస్ కంపెనీ ఈ బైక్‌ను గతేడాదే భారత మార్కెట్లో విడుదల చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

225CC సామర్థ్యం ఉన్న టివిఎస్ రోనిన్ బైక్ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ. 1.49 లక్షలు మాత్రమే. బహుషా ధోనీ వద్ద ఉన్న అత్యంత చౌకైన బైక్ ఇదే కావచ్చేమో. టివిఎస్ కంపెనీ స్వయంగా తమ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ధోనీకి బైక్‌ తాళం చెవి అందిస్తున్న ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో ధోనితో పాటు టీవీఎస్ మోటార్ కంపెనీ బిజినెస్ హెడ్ విమల్ సుంబ్లీని కూడా చూడొచ్చు. టివిఎస్ రోనిన్‌తో పాటు, మహేంద్ర సింగ్ ధోనీ వద్ద హార్లే డేవిడ్‌సన్ ఫ్యాట్ బాయ్, కాన్ఫెడరేట్ X132 హెల్‌క్యాట్, కవాసాకి నింజా H2, యమహా ఆర్‌ఎక్స్ 100, సుజుకి షోగన్, యమహా ఆర్‌డి 350, కవాసాకి నింజా ZX-14R వంటి బైక్స్ కూడా మహేంద్ర సింగ్ ధోనీ కలెక్షన్ జాబితాలో ఉన్నాయి. 


ధోనీ కొనుగోలు చేసిన టివిఎస్ రోనిన్ బైక్ ప్రత్యేకత ఏంటంటే..
టివిఎస్ రోనిన్ బైక్ మొత్తం మూడు వేరియంట్స్‌లో లాంచ్ అయింది. ఇక బైక్ డిజైన్ విషయానికొస్తే.. ఇది ఎల్ఇడి హెడ్‌ల్యాంప్, T- ఆకారంలో రూపొందించిన డిఆర్ఎల్ లైట్, LED ఇండికేటర్స్ అమర్చారు. ఇదే కాకుండా, టియర్ డ్రాప్ షేప్‌లో ఫ్యూయల్ ట్యాంక్, 225CC పవర్‌ఫుల్ ఇంజన్, స్లిమ్ సీట్ వంటి ప్రత్యేకతలు ఈ టివిఎస్ రోనిన్ బైక్ సొంతం.



 


మహేంద్ర సింగ్ ధోనీ కొనుగోలు చేసిన టివిఎస్ రోనిన్ బైక్ ఫీచర్ల గురించి విమల్ మాట్లాడుతూ .. బ్లూటూత్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో పాటు టర్న్ బై టర్న్ నేవిగేషన్‌ సిస్టం కలిగి ఉన్నాయి. 225.9cc సామర్థ్యం ఉన్న ఈ బైక్ ఫ్యూయల్-ఇంజెక్టెడ్ సింగిల్ - సిలిండర్ ఇంజన్‌తో పరుగులు తీస్తుంది. టివిఎస్ రొనిన్ 20hp పవర్, 20 Nm గరిష్ట టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 225.9CC సామర్థ్యంతో ఇంత తక్కువ ధరలో లభించే బైక్ కావడంతో ఈ బైక్‌పై క్రేజ్ ఏర్పడుతోంది.


ఇది కూడా చదవండి : Best Selling Hatchbacks: ఎక్కువగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇవే


ఇది కూడా చదవండి : PM Svanidhi Yojana: ఈ లోన్ తీసుకుంటే నయాపైస వడ్డీ లేదు.. గ్యారెంటీ అసలే లేదు


ఇది కూడా చదవండి : Small Savings Schemes: బ్యాంకులు ఇచ్చే వడ్డీ కంటే ఈ వడ్డీ రేట్లే ఎక్కువ


ఇది కూడా చదవండి : Photo Change On Aadhaar Card: ఆధార్ కార్డుపై ఫోటో మార్చుకోవడం ఎలా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook