MS Dhoni: ఐపీఎల్ నుంచి MS ధోని రిటైర్మెంట్? మధ్యాహ్నం ప్రకటించనున్న CSK కెప్టెన్..

MS Dhoni:  టీమిండియా మాజీ కెప్టెన్ ,మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం కీలక ప్రకటన చేయబోతున్నట్లు శనివారం ఎంఎస్ ధోనీ ప్రకటించారు. దీంతో ఆయన ఐపీఎస్ కు రిటైర్మెంట్ ప్రకటించనున్నారని భావిస్తున్నారు

Written by - Srisailam | Last Updated : Sep 25, 2022, 11:08 AM IST
  • ఎంఎస్ ధోనీ కీలక ప్రకటన
  • ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్?
  • ధోనీ ప్రకటనపై సర్వత్రా ఆసక్తి
 MS Dhoni: ఐపీఎల్ నుంచి MS ధోని రిటైర్మెంట్? మధ్యాహ్నం ప్రకటించనున్న CSK కెప్టెన్..

MS Dhoni:  టీమిండియా మాజీ కెప్టెన్ ,మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం కీలక ప్రకటన చేయబోతున్నట్లు శనివారం ఎంఎస్ ధోనీ ప్రకటించారు. దీంతో ఆయన ఐపీఎస్ కు రిటైర్మెంట్ ప్రకటించనున్నారని భావిస్తున్నారు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఉన్నారు జార్ఖండ్ డైనమెట్.

ఆదివారం కీలక ప్రకటన చేయబోతున్నానని శనివారం (సెప్టెంబర్ 24) మధ్యాహ్నం తన అభిమానులకు సందేశం ఇచ్చారు  చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత కెప్టెన్ ఎంఎస్ ధోని. తన సోషల్ మీడియా వెబ్‌సైట్‌లో పెద్ద ప్రకటన చేస్తానని చెబుతూ ఫేస్‌బుక్ లో పోస్ట్ చేశారు. ధోనీ చేసే ప్రకటన ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుండి రిటైర్మెంట్ అయి ఉంటుందనే చర్చ సాగుతోంది. ధోనీ రిటైర్మెంట్ వార్తలతో అతని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అలాంటి ప్రకటన చేయవద్దంటూ కొందరు అభిమానులు పోస్టులు పెడుతున్నారు. మిస్టర్ కూల్ ప్రకటన కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నానని... కాని అది ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటన అయి ఉండకూదడని కోరుకుంటున్నానని ఓ అభిమాని కామెంట్ చేశాడు.

ధోనీ ప్రస్తుత వయసు 41 ఏళ్లు. ఈ వయసులో క్రికెట్ ఆడటం కొంచెం కష్టమే. ముఖ్యంగా ఐపీఎల్ లాంటి ఈవెంట్ లో ఆడటానికి శరీరం అతనికి సహకరించకోపోవచ్చనే చర్చ నిపుణుల నంచి వస్తోంది. ఐపీఎస ్ 2022 సీజన్ సమయంలో రిటైర్మెంట్ పై హింట్ ఇచ్చారు ధోనీ. ఈ సీజనే తనకు చివరది అనే సిగ్నల్ ఇచ్చారు. కాని ఆయన అభిమానులు మాత్రం 2023 సీజన్ లోనూ అందుబాటులో ఉంటాడని ఆశించారు. కాని ఆదివారం కీలక ప్రకటన చేస్తానని చెప్పడంతో ధోనీ ఐపీఎల్ నుంచి తప్పుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది.

మరోవైపు కొవిడ్ కారణంగా ఐపీఎల్ ను 2021లో దుబాయ్ లో నిర్వహించారు. 2022లోనూ ఐపీఎల్ లీగ్ మ్యాచులు ముంబై, పుణేలో నిర్వహించారు. సెమీ ఫైనల్, ఫైనల్ మాత్రం గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. కొవిడ్ కన్నా ముందు మాత్రం ఐపీఎస్ ప్రాంచైజీల హోం గ్రౌండ్స్ లోనే ఐపీఎల్ మ్యాచులు జరిగేవి. గత రెండు సీజన్లలో హోం గ్రౌండ్ లో ఆడే అవకాశం కోల్పోయారు ఐపీఎస్ ప్లేయర్లు. అయితే వచ్చే సీజన్ లో మళ్లీ పాత ఫార్మాట్ లోనే ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ కు ధోనీ ఇప్పుడే రిటైర్మెంట్ ప్రకటించకపోవచ్చని.. 2023 సీజన్ లో హోం గ్రౌండ్ లో చివరి మ్యాచ్ ఆడి తప్పుకుంటారనే చర్చ కూడా సాగుతోంది. మొత్తంగా ఎంఎస్ ధోనీ ప్రకటన కోసం భారతావనీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది..

Also Read: MS Dhoni: రేపు సోషల్‌ మీడియా లైవ్‌లోకి ఎంఎస్ ధోనీ..ఆ విషయాన్నే చెప్పబోతున్నాడా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News