PM Kisan Updates: పీఎం కిసాన్ యోజనలో కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఇక నుంచి రేషన్ కార్డు నెంబర్ నమోదు చేస్తేనే..కిసాన్ యోజన వాయిదా ఎక్కౌంట్‌లో జమ అవుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో మరోసారి కీలకమైన మార్పు వచ్చింది. ఇప్పుడు కిసాన్ యోజనలో రిజిస్ట్రేషన్ కోసం రేషన్ కార్డు తప్పనిసరి అయింది. కిసాన్ యోజన ప్రయోజనాలు పొందాలంటే..వెంటనే రేషన్ కార్డు చేయించుకోవల్సిందే.


పీఎం కిసాన్ పోర్టల్‌లో రేషన్ కార్డ్ నెంబర్ నమోదు చేయడం ఇప్పుడు అనివార్యమైంది. రేషన్ కార్డు నెంబర్ లేకుండా రిజిస్ట్రేషన్ పూర్తి కాదు. మరోవైపు రేషన్ కార్డు దస్తావేజుల సాఫ్ట్‌కాపీను పీడీఎఫ్ రూపంలో పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తే చాలు. దాంతోపాటు కేవైసీ కూడా చేయాలి. దీనికింద ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, డిక్లరేషన్ హార్డ్‌కాపీ జమ చేయాలనే తప్పనిసరి నిబంధనను తొలగించారు. ఇకపై ఈ దస్తావేజుల్ని పీడీఎఫ్ రూపంలో సాఫ్ట్‌కాపీ అప్‌లోడ్ చేస్తే చాలు. ఫలితంగా రైతులకు సమయం ఆదా అవుతుంది. మరింత పారదర్శకత సాధ్యమౌతుంది. 


కిసాన్ సమ్మాన్ నిధి యోజన రిజిస్ట్రేషన్‌కు ఏం కావాలి


1. బ్యాంకు ఎక్కౌంట్ నంబర్ తప్పనిసరి. ఎందుకంటే ప్రభుత్వం డీబీటీ ద్వారా రైతులకు నగదు బదిలీ చేస్తుంది. 


2.  బ్యాంక్ ఎక్కౌంట్ ఆధారంగా లింక్ కావాలి.


3. ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ లేకుండా ఈ పధకం ప్రయోజనాలు అందవు.


4. పీఎం కిసాన్ వెబ్‌సైట్ pmkisan.gov.inలో అవసరమైన దస్తావేజులు అప్‌లోడ్ చేయాలి.


5. ఆధార్ కార్డు లింక్ చేసేందుకు ఫార్మర్ కార్నర్ ఆప్షన్ ఎంచుకోవాలి. అందులో ఎడిట్ ఆధార్ డిటైల్స్ ఆప్షన్ ఎంచుకోవాలి.


ఇలా చేస్తే..రైతుల ఖాతాల్లో 4 వేల రూపాయలు


ఈ పథకం కింద రావల్సిన 11వ వాయిదా ఇంకా అందకపోతే..12వ వాయిదాతో పాటు 11వ వాయిదా కలిపి వస్తుంది. అంటే రైతుల ఖాతాల్లో 4 వేల రూపాయలు ఒకేసారి అందుతాయి.ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద..రైతులకు 12వ వాయిదా కోసం నిరీక్షణ ఉంది. ఇప్పటికే చాలామందికి 11వ వాయిదా కింద 2 వేల రూపాయలు వచ్చేశాయి. రైతుల ఖాతాల్లో ఏడాదికి 6 వేల రూపాయల్ని మూడు వాయిదాల్లో బదిలీ చేస్తారు. 


Also read: Sukanya Samriddhi Scheme: సుకన్య సమృద్ధి యోజనలో కీలక మార్పులు, కొత్త నియమాలు ఇలా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook