Sukanya Samriddhi Scheme: సుకన్య సమృద్ధి యోజనలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ పథకం అర్హత, వడ్డీ వంటి విషయాల్లో నిబంధనలు మారిపోయాయి.
సుకన్య సమృద్ధి యోజన పథకంలో కీలకమైన మార్పులొచ్చాయి. కొత్త నియమాల ప్రకారం..తప్పు వడ్డీ జమ అయితే.. వెనక్కి ఇచ్చే సెక్షన్ తొలగించారు. ఇది కాకుండా ప్రతి యేటా ఇచ్చే వడ్డీ ఏడాది చివర్లోనే జమ అవుతుంది. గతంలో ఈ నియమం కుమార్తె 10 ఏళ్లకే ఖాతా ఆపరేట్ చేసుకునేది.
ఆడపిల్లల భవిష్యత్ సంరక్షణకు అద్భుతమైన పథకం సుకన్య సమృద్ధి యోజన. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ కుమార్తె 21 ఏళ్లకు వచ్చేసరికి లక్షాధికారి అవుతుంది. ఈ పథకంలో రోజుకు 416 రూపాయలు పెట్టుబడి పెట్టాలి. రోజుకు మీరు పెట్టే 416 రూపాయల పెట్టుబడి..భవిష్యత్తులో 65 లక్షల రూపాయలుగా మారుతుంది. మీ మీ కుమార్తె పెళ్లి లేదా చదువు ఖర్చుకు పనికొస్తుంది.
సుకన్య సమృద్ధి యోజన అనేది దీర్ఘకాలిక పథకం. ఇందులో పెట్టుబడితో మీ కుమార్తె భవిష్యత్ విషయంలో నిశ్చితంగా ఉండవచ్చు. పెట్టుబడి కూడా ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడీ పథకంలో కీలక మార్పులు వచ్చాయి. కొత్త నియమాల ప్రకారం ఖాతాలో పొరపాటున వడ్డీ జమ అయితే..వెనక్కి ఇచ్చే సెక్షన్ తొలగించేశారు. అటు వడ్డీ కూడా ఏడాది చివర్లో జమ అవుతుంది. గతంలో మీ కుమార్తె పదేళ్లకే ఈ ఖాతాను ఆపరేట్ చేయగలిగేది. ఇప్పుడు కొత్త నియమాల ప్రకారం 18 ఏళ్ల కంటే ముందు ఎక్కౌంట్ ఆపరేట్‌కు అవకాశం లేదు.
గతంలో ఈ పథకం కింద ఇద్దరు కుమార్తెలకు 80 సి సెక్షన్ కింద ట్యాక్స్ మినహాయింపు ఉండేది. మూడవ కుమార్తె ఉంటే మినహాయింపు ఉండేది కాదు. కొత్త నియమం ప్రకారం మొదటి కుమార్తె తరువాత ఇద్దరు కవల అమ్మాయిలైతే అదే ప్రయోజనం కలుగుతుంది.
ఈ ఖాతాలో ఏడాదికి కనీసం 250 రూపాయలు జమ చేయాలి. అలా చేయకపోతే ఎక్కౌంట్ డీఫాల్ట్ అవుతుంది. కానీ కొత్త నియమం ప్రకారం ఎక్కౌంట్ యాక్టివ్ చేయించకపోతే..మెచ్యూరిటీ పూర్తయ్యేవరకూ ఉన్న నగదుపై వడ్డీ లభిస్తుంటుంది. సుకన్య సమృద్ధి యోజన ఎక్కౌంట్‌ను గతంలో రెండు పరిస్థితుల్లోనే క్లోజ్ చేసేందుకు వీలుండేది. కుమార్తె మరణించినప్పుడు లేదా కుమార్తె చిరునామా మారినప్పుడు. కానీ కొత్త నియమాల ప్రకారం ప్రాణాంతక వ్యాధి ఎదురైనప్పుడు కూడా ఎక్కౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు.
Also read: Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఎంఐ స్మార్ట్‌టీవీ కేవలం 5 వందల రూపాయలకే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook