SBI Credit Card New Rules: 2023 జనవరి నుండి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ కొత్త రూల్స్.. ఖర్చు విషయంలో జాగ్రత్త
SBI Credit Card New Rules: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ హోల్డర్స్‌కి ఎస్బీఐ బ్యాడ్ న్యూస్ చెప్పింది. కొన్నిచోట్ల చెల్లింపుల విషయంలో ఖర్చు పెంచడంతో పాటు ఇంకొన్ని చోట్ల స్పెండింగ్స్‌పై వచ్చే రివార్డ్స్ పాయింట్స్‌పై కోత విధించింది. ఇంతకీ పెరిగే ఖర్చు ఏంటి, తగ్గే రివార్డ్స్ పాయింట్స్ ఏంటో తెలుసుకుందాం రండి.
SBI Credit Card New Rules: న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ జనవరి 2023 నుండి కొత్త నిబంధనలు ప్రవేశపెడుతోంది. సింప్లీక్లిక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ కి విధించిన కొన్ని నియమాలను సవరించినట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ అధికారిక వెబ్ సైట్ ద్వారా ప్రకటించింది. ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ వెబ్‌సైట్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం, వోచర్, రివార్డ్ పాయింట్లను రిడెంప్షన్ చేసుకోవడానికి సంబంధించిన రెండు నియమాలు 2023 కొత్త సంవత్సరంలో మారనున్నాయి.
6 జనవరి 2023 నుంచి క్రెడిట్ కార్డుతో ఆన్‌లైన్ ద్వారా చేసే చెల్లింపులు నిర్ధిష్టమైన మైలురాయిని చేరుకున్నట్టయితే.. సింప్లీక్లిక్ కార్డ్ హోల్డర్‌లకు జారీ చేసే క్లియర్‌ట్రిప్ వోచర్‌ని ఇకపై ఒకే లావాదేవీలో మాత్రమే రీడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు తరహాలో మరే ఇతర ఆఫర్ లేదా వోచర్లతో కలిపి రెడీమ్ చేసుకునే అవకాశం లేదు.
అలాగే జనవరి 1 నుండి అమేజాన్.ఇన్ వెబ్సైట్లో సింప్లిక్లిక్ క్రెడిట్ కార్డుతో ఆన్‌లైన్ ద్వారా ఖర్చు చేసే మొత్తంపై లభించే రివార్డ్స్ పాయింట్‌లకు సంబంధించిన నియమనిబంధనలు కూడా మారనున్నాయి.
అమేజాన్.ఇన్ వెబ్సైట్లో సింప్లిక్లిక్ లేదా సింప్లిక్లిక్ అడ్వాంటేజ్ ఎస్బీఐ కార్డ్ ద్వారా జరిపే ఆన్‌లైన్ చెల్లింపులపై లభించే 10 రెట్ల రివార్డ్ పాయింట్స్ కాస్తా జనవరి 01, 2023 నుండి 5 రెట్ల రివార్డ్ పాయింట్‌లకు సవరించినట్టు ఎస్బీఐ స్పష్టంచేసింది. అయితే, " అపోలో 24x7, క్లియర్‌ట్రిప్ , ఈజీడైనర్, లెన్స్‌కార్ట్ అండ్ నెట్‌మెడ్స్ వంటి ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ లో ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించినప్పుడు మాత్రం మీకు 10 రెట్ల రివార్డ్ పాయింట్స్ రావడం జరుగుతుంది " అని ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ వెల్లడించింది
ఎస్బీఐ కార్డ్స్ ద్వారా జరిపే ఇఎంఐ లావాదేవీలపై ఛార్జీలను, క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి జరిపే అద్దె చెల్లింపులపై కొత్త ఛార్జీలను 15 నవంబర్ 2022 నుండే సవరించిన విషయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి గుర్తుచేసింది.
"మీ క్రెడిట్ కార్డ్‌పై జరిపే ఈఎంఐ లావాదేవీలపై ప్రాసెసింగ్ ఫీజు రూ. 199కి సవరించారు. అదనంగా పన్నులు వర్తిస్తాయి. గతంలో ఇది రూ. 99 ప్లస్ పన్నులు చెల్లించాల్సి ఉండేది. అలాగే రెంట్ పేమెంట్స్ ట్రాన్సాక్షన్స్‌పై ప్రాసెసింగ్ ఫీజు 99 రూపాయలతో పాటు యధావిధిగా విధించే పన్నులు అలాగే వర్తిస్తాయి" అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది.
ఇది కూడా చదవండి : Home Loan Repayment: ఇంటి రుణం చెల్లింపు భారం కాకుండా ఉండాలంటే ఇలా చేయండి
ఇది కూడా చదవండి : New Cars Prices Increasing: కొత్తగా కారు కొంటున్నారా ? ఐతే ఇది మీకోసమే
ఇది కూడా చదవండి : Train Ticket Charges: రైలు టికెట్లపై రాయితీలు నిజమేనా ? లేక ఊహాగానాలా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook