Senior citizens  Fixed Depsits: సాధారణంగా పోస్ట్ ఆఫీస్ లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం కింద మీరు డబ్బును పొదుపు చేసినట్లయితే.. మీరు మంచిగా పెద్ద మొత్తంలో వడ్డీ ఆదాయం పొందే అవకాశం లభిస్తుంది. సాధారణంగా ఈ స్కీం కింద ప్రతి మూడు మాసాలకు ఒకసారి వడ్డీ లభిస్తుంది.అయితే ఈ స్కీమ్లో గరిష్టంగా మీరు 50 వేల రూపాయల వరకు వడ్డీ ఆదాయం లభించాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SCSS ..సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ పథకం(Senior Citizen Savings Scheme Interest Rate)అకౌంటు భారతదేశంలోని ఏదైనా ప్రభుత్వ బ్యాంకు లేదా ఏదైనా పోస్టాఫీసులో తెరవవచ్చు.ఈ అకౌంటు దేశంలోని ఏ బ్యాంకుకు అయినా బదిలీ చేసుకోవచ్చు.ఈ పథకం డిపాజిట్‌పై అధిక వడ్డీ రేటును అందిస్తుంది.భారతీయ పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు పొందవచ్చు.ఈ ఖాతా 5 సంవత్సరాల కాలవ్యవధిని మరో 3 సంవత్సరాలు పొడిగించుకునే వీలుంది.


Also Read : Form 16: ఫారం 16 లేకుండానే ఐటీఆర్ ఫైల్ చేయోచ్చు? ఎలాగో తెలుసా?    


SCSS అకౌంటు తెరవడానికి అవసరమైన పత్రాలు ఇవే:


- రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు


- PAN కార్డ్ , ఓటర్ ID ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులు చెల్లుబాటు అవుతాయి.


- ఆధార్ కార్డ్ ఇంటి చిరునామా కార్డుగా ఉపయోగించుకోవచ్చు.


-పాన్ కార్డ్, ఓటర్ ID, జనన ధృవీకరణ పత్రం, రేషన్ కార్డ్ మీ వయస్సు రుజువు చేసుకునేందుకు ఉపయోగపడతాయి. 


ఈ స్కీం కింద వడ్డీ రేటు 8.2 శాతం వరకూ లభిస్తోంది. కాబట్టి, త్రైమాసిక వడ్డీలో రూ. 50,000 పొందాలంటే..కనీసం రూ.24,39,100 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే సంవత్సరానికి రూ. 50,000 మించితే వడ్డీపై TDS తీసివేస్తారు.ఒక ఆర్థిక సంవత్సరంలో మీ వడ్డీ ఆదాయం రూ.50,000 కంటే తక్కువ ఉంటే, మీరు ఫారమ్ 15G/15H పోస్టాఫీసుకు సమర్పించితే TDS తీసివేయరు. 


Also Read: Gold Price Today: ఆ మురిపమూ మూడు రోజుల ముచ్చటే..మళ్లీ పెరిగిన బంగారం ధర..తులం ఎంత పెరిగిందంటే? 



Disclaimer: ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని జీ తెలుగు పాఠకులను సూచిస్తుంది.


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook