Form 16: ఫారం 16 లేకుండానే ఐటీఆర్ ఫైల్ చేయోచ్చు? ఎలాగో తెలుసా?

ITR File Without Form 16: ఇప్పుడంతా ఐటీఆర్ సీజన్ నడుస్తోంది. గతేడాదికి ఆదాయపు పన్న రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఇంకా 4 రోజుల గడువు మాత్రమే ఉంది. ఇప్పటికీ రిటర్న్స్ దాఖలు చేయాని వారు వీలైనంత తొందరగా ఈ ప్రక్రియను పూర్తి చేయడం బెటర్. అయితే ఫారం 16 లేకుండా ఐటీఆర్ ఫైలింగ్ చేయడం ఎలాగో తెలుసా?   

Written by - Bhoomi | Last Updated : Jul 27, 2024, 03:28 PM IST
 Form 16: ఫారం 16 లేకుండానే ఐటీఆర్ ఫైల్ చేయోచ్చు? ఎలాగో తెలుసా?

ITR File : ఐటీఆర్ ఫైలింగ్ కు చివరి తేదీ జులై 31. గడువు దగ్గరపడుతోంది. వీలైనంత తొందరగా మీ ఐటీఆర్ రిటర్న్స్ దాఖలు చేయండి. కొందరు వేతనం ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తున్నప్పటికీ ఫారం 16 ఉండకపోవచ్చు. మరి అలాంటప్పుడు రిటర్న్స్ దాఖలు చేయడం ఎలా? దీనిగురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

గతేడాది ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీఆర్ దాఖలు చేసేందుకు జులై 31తో గడువు ముగుస్తుంది. ఈ గడువు ఇంకా పొడిగిస్తారా లేదా అనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే ఇప్పటికీ రిటర్న్స్ దాఖలు చేయనివారు సాధ్యమైనంత వరకు ఈ ప్రక్రియను పూర్తి చేయడం బెటర్. రిటర్న్స్ సమర్పించేటప్పుడు ఫారం 16లేకున్నా పర్వాలేదు. ఇతర ఆధారాలు అందుబాటులో ఉంటే వాటిలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించి మీ ఆదాయపు పన్ను రిటర్న్స్ ను దాఖలు చేసుకోవచ్చు. ముఖ్యంగా బ్యాంకు ఖాతా వివరాలతోపాటు జీతం రశీదులు, వడ్డీ సర్టిఫికేట్లు వంటి ఇతర మార్గాల్లో వచ్చిన ఆదాయానికి సంబంధించిన పత్రాలను తీసుకుని..వాటి ఆధారంగా ఐటీఆర్ రిటర్నర్స్ సమర్పించే అవకాశం ఉంది. 

Also Read : Gold Price Today: ఆ మురిపమూ మూడు రోజుల ముచ్చటే..మళ్లీ పెరిగిన బంగారం ధర..తులం ఎంత పెరిగిందంటే? 

పన్ను చెల్లింపుదారులకు పలు మార్గాల్లో ఆదాయం వస్తుంది. వాటిలో ప్రధానంగా జీతం, వడ్డీ, అద్దె, ఇతర వనరులు కూడా పరిగణలోనికి తీసుకోవాలి. ఇవన్నీ కలిపితే గత ఆర్థిక ఏడాది మీరు సంపాదించిన మొత్తం డబ్బు లెక్క తేలిపోతుంది. ఆదాయపు పన్ను పోర్టల్ నుంచి ఫారం 25ఏఎస్ వార్షిక సమాచారం నివేదికను తీసుకోవాలి. వీటిలో మీకు పలు మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం వివరాలన్నీ అందులో ఉంటాయి. కాబట్టి  ఈ ఆధారాలతోపాటు ఆదాయపన్ను రిటర్న్స్  సమర్పించవచ్చు. ఒకవేళ మీ కంపెనీ మెనేజ్ మెంట్ టీడీఎస్ విధిస్తే ఆదాయపు పన్ను చట్టం ప్రకారం..కచ్చితంగా ఫారం 16 జారీ చేస్తుంది. కొన్నిసార్లు మీ ఆదాయం ఉన్నప్పటికీ టీడీఎస్ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మెనేజ్ మెంట్ ఫారం 16 ఇవ్వకపోవచ్చు. అలాంటి సమయంలో పైన పేర్కొన్న ప్రకారం లెక్కలు వేసుకోవాలి. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News