Todays Gold Rate: రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం పరోక్షంగా ధరలపై పడుతోంది. ఆయిల్, బంగారం రేట్లు ఆకాశాన్నంటేలా కన్పిస్తున్నాయి. బంగారం ధర రోజురోజుకూ భారీగా పెరుగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగారం ధరలు రోజురోజుకూ మారుతుంటాయి. వివిధ దేశాల మధ్య బౌతికంగా నెలకొన్న పరిస్థితులు బంగారం ధరలపై ఎప్పుడూ ప్రభావం చూపిస్తుంటాయి. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధంతో బంగారం ధరలు అమాంతం పెరిగిపోయాయి. మరోవైపు క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతోంది. యుద్ధం నేపధ్యంలో పెరుగుతున్న ధరల జాబితాలో బంగారం ధర కీలకంగా ఉంది. ఇప్పటికే పది గ్రాముల బంగారం ధర 52 వేలు దాటేసింది. 


దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర 48 వేల 4 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 8 వందలుగా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 4 వందలుండగా, 24 క్యారెట్ల ధర 52 వేల 8 వందలుంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 7 వందలుంటే..24 క్యారెట్ల ధర 54 వేల 220 రూపాయలుంది. ఇక కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 4 వందలైతే..24 క్యారెట్ల ధర 52 వేల 8 వందలుంది. 


ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 4 వందలు కాగా, 24 క్యారెట్ల ధర 52 వేల 8 వందలుంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర 48 వేల 4 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 52 వేల 8 వందలుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరి కొద్దిరోజులు కొనసాగితే..బంగారం ధర 60 వేలకు చేరవచ్చనేది అంచనా.


Also read: TATA Play Discount Offers: ఛానెల్ ప్యాక్ ధరలు సగానికి తగ్గింపు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook