TATA Play Discount Offers: ఛానెల్ ప్యాక్ ధరలు సగానికి తగ్గింపు

TATA Play Discount Offers: డీటీహెచ్ చందాదారులకు గుడ్‌న్యూస్. ప్రముఖ డీటీహెచ్ కంపెనీ టాటా ప్లే భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ప్యాక్ ధరల్ని ఏకంగా సగానికి తగ్గిస్తున్నట్టు వెల్లడించింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 6, 2022, 09:53 PM IST
TATA Play Discount Offers: ఛానెల్ ప్యాక్ ధరలు సగానికి తగ్గింపు

TATA Play Discount Offers: డీటీహెచ్ చందాదారులకు గుడ్‌న్యూస్. ప్రముఖ డీటీహెచ్ కంపెనీ టాటా ప్లే భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ప్యాక్ ధరల్ని ఏకంగా సగానికి తగ్గిస్తున్నట్టు వెల్లడించింది.

దేశంలో కేబుల్ వ్యవస్థకు సమాంతరంగా డీటీహెచ్ రంగం విస్తరిస్తోంది. క్వాలిటీ, సర్వీస్ పేరుతో ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లతో కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి డైరెక్ట్ టు హోమ్ కంపెనీలు. డీటీహెచ్ కంపెనీల మధ్య పోటీకు అనుగుణంగా కంపెనీలు ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా దేశంలోని అతిపెద్ద డీటీహెచ్ కంపెనీ టాటా ప్లే చందాదారుల కోసం భారీ ఆఫర్ ప్రకటించింది.

టాటా ప్లే సబ్‌స్క్రైబర్ల కోసం ఛానెల్ ప్యాక్‌ల ధరల్ని ఏకంగా సగానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది టాటా ప్లే కంపెనీ. ఓటీటీ కంటెంట్ రాజ్యమేలుతున్న సమయంలో ఛానెల్ ప్యాక్ ధరల్ని తగ్గించడం ద్వారా కస్టమర్లను మరింతగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది టాటా ప్లే. ఇతర కంపెనీలు మాత్రం రేట్లు పెంచుతూ యావరేజ్ రెవిన్యూ పర్ యూజర్ పెంచుకునేందుకు ఆలోచిస్తున్నాయి. అందుకే టాటా ప్లే ఆఫర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఛానెల్ రేట్ల తగ్గింపు ఏ మేరకు ఉంటుందనేది యూసేజ్ హిస్టరీని బట్టి ఉంటుంది. కస్టమర్..తనకు కావల్సిన ఛానెల్స్‌ను మాత్రమే ఎంపిక చేసుకునేలా ధరల తగ్గింపు ఉంటుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఎంతలేదన్నా ప్రతి చందాదారుడికి నెలకు 30 నుంచి వంద రూపాయలు ఆదా అవనుంది. ప్రస్తుతం టాటా ప్లేకు దేశవ్యాప్తంగా 19 మిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. టాటా స్కై నుంచి టాటా ప్లేగా మారిన కంపెనీ వివిధ టీవీ ఛానెళ్లతో పాటు ఓటీటీ సర్వీసుల్ని కూడా అందిస్తోంది. 

Also read: Gold Price Today: మహిళలకు షాకింగ్‌ న్యూస్.. భారీగా పెరిగిన పసిడి ధర..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News