Banking System: ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సి బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్. బ్యాంకు రుణాలకు సంబంధించి ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్యాంకు కస్టమర్లకు సంబంధించిన కీలకమైన అప్‌డేట్‌ను కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. బ్యాంకుల్నించి రుణాలు తీసుకునేవారికి ఇది శుభవార్త. బ్యాంకింగ్ వ్యవస్థకు కొన్ని సూచనలు చేశారు. బ్యాంకింగ్ వ్యవస్థను మరింత సులభతరం చేయాలని..తద్వారా ప్రజలకు బ్యాంకింగ్ సేవలు మరింతగా అందుతాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. బ్యాంకు కస్టమర్ల వెసులుబాటుపై మరింత శ్రద్ధ పెట్టాలని..రుణాలిచ్చే ప్రక్రియ సులభతరం కావాలని సూచించారు.


రుణాలిచ్చే మార్గాల్ని అందుబాటులో ఉంచాలని ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. వాస్తవానికి కొద్దిరోజుల క్రితమే.పారిశ్రామిక వేత్తలు, మంత్రి నిర్మలా సీతారామన్ మధ్య కీలకమైన భేటీ జరిగింది. ఎస్బీఐ,హెచ్‌డీ‌ఎఫ్‌సి, ఐసీఐసీఐ సహా బ్యాంకుల కస్టమర్లకు ప్రయోజనాలుంటాయి.


కస్టమర్ల సౌకర్యాలపై ఫోకస్


బ్యాంకులు సాధ్యమైనంత వరకూ కస్టమర్ ఫ్రెండ్లీగా ఉండాలని ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే రిస్క్ తీసుకునే విధంగా ఉండకూడదని కూడా సూచించారు. కస్టమర్ల సౌకర్యాలు, వెసులుబాట్లను దృష్టిలో ఉంచుకుని సానుకూలంగా ఉండాలన్నారు. కస్టమర్ల సౌకర్యాలకై బ్యాంకుల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ పెరుగుతోందని ఎస్బీఐ ఛైర్మన్ దినేష్ కుమార్ ఖారా తెలిపారు.


Also read: September 2022 Bank Holidays: సెప్టెంబర్ నెలలో 13 రోజులు బ్యాంకులకు సెలవులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook