5G Internet Trials: వోడాఫోన్ ఐడియా మెరుపువేగంతో డేటా బదిలీ, త్వరలో 5జీ
5G Internet Trials: దేశంలో 5 జీ ఇంటర్నెట్ సేవలకు మార్గం సుగమమవుతోంది. వోడాపోన్ ఐడియా 5 జీ ట్రయల్స్‌లో రికార్డు సృష్టించింది. మెరుపు వేగంతో డేటా బదిలీ చేసి ప్రాచుర్యం పొందింది.
5G Internet Trials: దేశంలో 5 జీ ఇంటర్నెట్ సేవలకు మార్గం సుగమమవుతోంది. వోడాపోన్ ఐడియా 5 జీ ట్రయల్స్‌లో రికార్డు సృష్టించింది. మెరుపు వేగంతో డేటా బదిలీ చేసి ప్రాచుర్యం పొందింది.
ఇండియాలో త్వరలో 5జి ఇంటర్నెట్ సేవలు(5G Internet Services) అందనున్నాయి. ఇప్పటికే వివిధ కంపెనీలు ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం(Central government)ఇటీవల ఏజీఆర్ బకాయిలపై నాలుగేళ్లపాటు మారటోరియం విధించడం, నూరుశాతం ఎఫ్‌డీఐలకు అనుమతివ్వడంతో టెలీకాం కంపెనీలు తిరిగి తమ ప్రణాళికల్నివేగంగా అమలు చేస్తున్నాయి. ప్రముఖ టెలికాం కంపెనీ వోడాఫోన్ ఐడియా(Vodafone Idea) దేశంలో 5జీ ఇంటర్నెట్ సేవలకు సంబంధించి ట్రయల్స్ నిర్వహించింది. పూణేలో నిర్వహించిన ట్రయల్స్‌లో ఆ సంస్థ రికార్డు సాధించింది. 3.7 జీబీపీ వేగంతో డేటా బదిలీ చేసి సరికొత్త రికార్డు(Vodafone Idea New Record in 5G Trials) సృష్టించింది.
గాంధీనగర్, పూణేలలో కేటాయించిన మిడ్ బ్యాండ్ స్పెక్ట్రమ్‌లో నిర్వహించిన ట్రయల్స్‌లో 1.5 జీబీపీ వరకూ డౌన్‌లోడ్ వేగాన్ని అందుకున్నట్టు కంపెనీ తెలిపింది. జియో, ఎయిర్‌టెల్ 5జీ(Airtel 5G Speed) స్పీడ్ కంటే వోడాఫోన్ ఐడియా లోడ్ స్పీడ్ ఎక్కువని తేలింది. 5జి ట్రయల్స్ కోసం రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా సంస్థలు చేసుకున్న దరఖాస్తుల్ని డీవోటీ ఆమోదించింది. ఆ తరువాత 5 జి ట్రయల్స్ నిర్వహణకై అనుమతి మంజూరు చేసింది. జూన్ నెలలో జియా 1 జిబీపీ గరిష్ట వేగంతో ట్రయల్స్(Jio 5G Speed) నిర్వహించగా, జూలై నెలలో ఎయిర్‌టెల్ 1.2 జీబీపీతో ట్రయల్స్(5G Internet Trials) నిర్వహించింది. ట్రయల్స్ పూర్తయ్యాక త్వరలోనే దేశంలో 5జీ ఇంటర్నెట్ సేవలు ప్రారంభం కానున్నాయి.
Also read: Aadhar PAN linking : ట్యాక్స్ రిఫండ్‌లకు, పాన్-ఆధార్ అనుసంధానానికి గడువు పొడిగింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook