Deadline for linking Aadhaar with PAN card and Income Tax Return filing extended: ఆధార్‌తో పాన్ అనుసంధాన గడువును ఆరు నెలల పాటు పొడిగించారు. 2022 మార్చి వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆధార్‌ను పాన్‌తో అనుసంధానం చేయడానికి గడువును సెప్టెంబరు 30, 2021 నుంచి మార్చి 31, 2022 వరకు పొడిగిస్తున్నట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు(సీబీడీటీ) (Central Board of Direct Taxes)పేర్కొంది. కరోనా వల్ల వివిధ వర్గాల వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీడీటీ (cbdt) తెలిపింది. అలాగే ప్రొహిబిషన్ ఆఫ్ బినామీ ప్రోపర్టీ ట్రాన్సాక్షన్స్ యాక్ట్-1988 కింద నోటీసులు, ఆదేశాల జారీకి గడువును కూడా మార్చి 2022 వరకు పెంచారు.
ట్యాక్స్ రిఫండ్‌లకు దరఖాస్తు గడువు డిసెంబరు 31
పెండింగ్‌లో ఉన్న పన్ను రిఫండ్‌లు పొందేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించేందుకు డిసెంబరు 31 వరకు గడువు పెంచారు. ఎగుమతిదార్లకు వివిధ ఎగుమతి ప్రోత్సాహక పథకాల కింద రావాల్సిన పన్ను రిఫండ్‌ల (refunds) కోసం సెప్టెంబరు 9న రూ.56,027 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. మర్చండైజ్ ఎక్స్‌పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా స్కీమ్ ( Merchandise Exports from India Scheme)(ఎంఈఐఎస్) (MEIS) కింద పెండింగ్‌లో ఉన్న రిఫండ్‌ల కోసం దరఖాస్తులను ఎగుమతిదార్లు సమర్పించవచ్చని మంత్రిత్వ శాఖ వెల్లడిచింది.
Also Read : Heart Wrenching Video:హెల్మెట్ లేకపోతే ఇతడి తల పుచ్చకాయలా పగిలిపోయేది..!
ఎంఈఐఎస్, ఎస్‌ఈఐఎస్, ఆర్‌ఓఎస్‌సీటీఎల్, ఆర్‌ఓఎస్‌ఎల్, 2 శాతం అదనపు ప్రోత్సాహక పథకాల కింద ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణకు 2021 డిసెంబరు 31ను తుది గడువుగా ప్రకటించారు. సో.. ఆధార్‌తో (Aadhaar) పాన్ అనుసంధాన గడువుతో పాటు పెరిగిన ఈ గడువులన్నీ ఉపయోగించుకోండి.
Also Read : Saidabad Raju Incident: సైదాబాద్ హత్యాచార ఘటన నిందితుడు రాజు మృతిపై అనుమానాలు ఎందుకు : DGP Mahender Reddy
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Aadhar PAN linking : ట్యాక్స్ రిఫండ్‌లకు, పాన్-ఆధార్ అనుసంధానానికి గడువు పొడిగింపు
పాన్-ఆధార్ అనుసంధానానికి గడువు పొడిగింపు
సెప్టెంబరు 30, 2021 నుంచి మార్చి 31, 2022 వరకు పొడిగింపు
పెండింగ్‌లో ఉన్న పన్ను రిఫండ్‌లు పొందేందుకు గడువు పెంపు