Pushpa Movie Latest Update: పుష్ప సినిమాలో ఇవాళ్టి నుంచి ఆ సీన్ కట్..రష్మిక ప్రైవేట్ పార్ట్స్‌పై..
Pushpa Movie Latest Update: ఫ్లవర్ అనుకున్నావా...ఫైర్ అంటూ దూసుకుపోతున్న పుష్ప నుంచి ఓ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ వెలువడింది. ఆ సినిమాలో అభ్యంతరకరంగా ఉన్న ఓ సీన్‌ను ఇవాళ్టి నుంచి తొలగిస్తున్నారు. ఆ సీన్ ఏంటో తెలుసా..
Pushpa Movie Latest Update: ఫ్లవర్ అనుకున్నావా...ఫైర్ అంటూ దూసుకుపోతున్న పుష్ప నుంచి ఓ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ వెలువడింది. ఆ సినిమాలో అభ్యంతరకరంగా ఉన్న ఓ సీన్‌ను ఇవాళ్టి నుంచి తొలగిస్తున్నారు. ఆ సీన్ ఏంటో తెలుసా..
దేశవ్యాప్తంగా 5 భాషల్లో విడుదలై సంచలనం సృష్టిస్తున్న పుష్ప సినిమా నుంచి అతి ముఖ్యమైన అప్‌డేట్ ఇది. కొంతమందికి నిరాశ కల్గించే వార్త ఇది. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా హిట్‌టాక్ తెచ్చుకుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపధ్యంలో తీసిన ఈ సినిమాలో లవ్ అండ్ యాక్షన్ సన్నివేశాలే ఉన్నాయి. అల్లు అర్జున్-రష్మిక మందన్నాల మధ్య ఉన్న కొన్ని రొమాంటిక్ లవ్ సన్నివేశాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. కొన్ని దృశ్యాలు మొరటుగా ఉన్నా..కొన్ని దృశ్యాలు ఫన్నీగా ఉన్నాయి. కొన్ని దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయి.
యాక్షన్ సన్నివేశాల్ని తీయడంలో దర్శకుడు సుకుమార్(Sukumar)వెనుకడుగు వేయనట్టే..రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా రాజీపడలేదు. అయితే పుష్ప సినిమాలోని(Pushpa Movie)ఒక రొమాంటిక్ సన్నివేశం మరీ ఎబ్బెట్టుగా..అంటే ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇబ్బందికరంగా ఉందనే విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో బాధ్యత గల లెక్కల మాస్టారిగా సుకుమార్ వెంటనే స్పందించారు. అభ్యంతరకరంగా ఉన్న ఆ సీన్‌ను ఇవాళ్టి నుంచి సినిమాల్లో తొలగిస్తున్నారు.
ఆ సీన్ ఏంటి..ఎక్కడ
పుష్ప- శ్రీవల్లిల మధ్య రొమాంటిక్ సన్నివేశాలతో(Romantic Scene)పాటు కొన్ని డైలాగ్స్ కూడా కాస్త ఇబ్బందికరంగానే ఉన్నాయి. డబ్బులిస్తే ముద్దు పెట్టేందుకు సిద్ధమవడం, ఇంకా దేనికైనానా అనడం అభ్యంతరకర డైలాగే. అయితే ఓ సీన్ మాత్రం మరీ అభ్యంతరకరంగా ఉంది. సినిమా సెకండ్ హాఫ్‌లో మారుతి వ్యాన్‌లో కూర్చున్న అల్లు అర్జున్..పక్కనున్న శ్రీవల్లి అలియాస్ రష్మికపై(Rashmika Mandanna)భుజంపై నుంచి చేయి వేస్తాడు. ఆ చేయిని రష్మిక ప్రైవేటు పార్ట్స్‌పై వేసినట్టుగా చూపిస్తారు. నీ చేయెక్కడుందని హీరోయిన్ ప్రశ్నించడం, ఎక్కడుందని అల్లు అర్జున్(Allu Arjun)అడగడం ప్రత్యేకించి హైలైట్ చేసినట్టు చూపించారు. ఈ సీన్ ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇబ్బందిగా మారింది. కొంతమంది మహిళలు అభ్యంతరం తెలిపారు. ఈ విషయం సుకుమార్‌కు తెలియడంతో..వెంటనే స్పందించారు. ఆ అభ్యంతరకర సన్నివేశాన్ని సినిమా నుంచి తొలగించారు. ఇవాళ్టి నుంచి ఆ సీన్ తొలగించి..షో వేయనున్నారు.
Also read: BiggBoss Telugu 5 Grand Finale: బిగ్‌బాస్ తెలుగు 5 గ్రాండ్ ఫినాలే అతిధుల జాబితా ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook