Akhil Akkineni: రేసుగుర్రంలా దూసుకెళ్తోన్న హీరో అఖిల్
Akhil Akkineni Horse Riding Skills: టాలీవుడ్ ‘కింగ్’ నాగార్జున తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన నటుడు అఖిల్ అక్కినేని. అయితే సినీ ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ మాత్రమే ఉంటే సరిపోదని కాస్త లక్ కూడా కలిసిరావాలని తెలిసిందే. అవకాశాలు దక్కుతున్నా విజయం దక్కాలంటే కఠోర శ్రమ తప్పదు. గుర్రంపై రేసుగుర్రంలా అఖిల్ దూసుకెళ్తోన్న వీడియో వైరల్ అవుతోంది.
Akhil Akkineni Horse Riding Skills: అక్కినేని వారబ్బాయిగా, టాలీవుడ్ ‘కింగ్’ నాగార్జున తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన నటుడు అఖిల్ అక్కినేని. అయితే సినీ ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ మాత్రమే ఉంటే సరిపోదని కాస్త లక్ కూడా కలిసిరావాలని తెలిసిందే. అంతటితో కథ ఆగదు.. అవకాశాలు దక్కుతున్నా విజయం దక్కాలంటే కఠోర శ్రమ తప్పదు. వీటిని నిరూపించేందుకు అఖిల్ తన వంతుగా శ్రమిస్తున్నాడు. తనకంటూ ఓ స్టైల్ ఉండాలని, కొత్త విషయం తెలియాలని తాపత్రయపడుతున్నాడు.
ఆదివారం ఆటవిడుపుగా రేసుగుర్రంలా అఖిల్ (Akhil Akkineni) దూసుకెళ్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ పీఆర్వో బీఏ రాజు తన ట్విట్టర్‌లో అఖిల్ గుర్రపు స్వారీ వీడియో పోస్ట్ చేయగా ట్రెండ్ అవుతోంది. అయితే సోమవారం సైతం హార్స్ రైడింగ్ చేస్తూ అఖిల్ చెమటోడ్చుతున్నాడు. ప్రస్తుతం అఖిల్ ఓ సినిమాతో బిజీగా ఉన్నాడు. టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను విడుదలకు సిద్దంగా ఉంది. భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి గోపీ సుందర్ స్వరాలు సమకూర్చాడు.
Also Read : Bigg Boss Telugu 4: ఫైనల్ చేరిన తొలి కంటెస్టెంట్ అఖిల్.. డేంజర్ జోన్‌లో అతడే!
అఖిల్ ఇటీవల తరచుగా హార్స్ రైడింగ్ వీడియోలు షేర్ చేస్తుండటంతో ఏ సినిమా కోసం అఖిల్ ఈ ఫీట్లు చేస్తున్నాడా అని తెలుగు ప్రేక్షకులు ఆలోచనలో పడ్డారు. అయితే ఎంత బ్యాక్‌గ్రౌడ్ ఉన్నా నటన, సొంత కష్టం లేకపోతే ప్రస్తుత పోటీలో అఖిల్ నెగ్గుకు రావడం కష్టమే. అందుకే అఖిల్ గుర్రంపై స్వారీ చేస్తూ తన రూటు మార్చాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Photos : Madhumita Sarkar Photos: బుల్లితెరను ఏలుతున్న మధుమితా సర్కార్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe