Yash joins KGF Chapter 2 movie shooting: కరోనావైరస్ (Coronavirus) అన్నిరంగాలను అతలాకుతలం చేసింది. కరోనా లాక్‌డౌన్ నాటినుంచి అన్ని రంగాలు కూడా తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. అయితే సినిమా రంగం (Film industry) కూడా దాదాపుగా ఆరేడు నెలల నుంచి ఆగిపోయిన విషయం తెలిసిందే. పెద్ద, చిన్న సినిమాల షూటింగ్‌లన్నీ అర్థాంతరంగా నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో చిత్ర యూనిట్లు ఇప్పుడిప్పుడే చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల షూటింగ్‌లను పునఃప్రారంభిస్తున్నాయి. ఈ క్రమంలోనే క‌న్న‌డ సూప‌ర్ డూపర్ హిట్ చిత్రం కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా రూపొందుతున్న కేజీఎఫ్ 2 (KGF-2) చిత్ర షూటింగ్‌ కూడా ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లోకి రాఖీ భాయ్.. అదేనండి హీరో యశ్ (Yash) కూడా అడుగుపెట్టారు. ఈ సందర్భంగా య‌శ్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో స‌ముద్రం ఒడ్డున నిల్చున్న ఫోటోని షేర్ చేశాడు. Also read: Nani: సినిమా సెట్‌లో ‘టక్ జగదీష్’



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఫొటోను షేర్ చేసి ఈ విధంగా రాశాడు. ‘‘అల‌ల‌ను మ‌నం ఆప‌లేము.. కానీ మనం ప్ర‌యాణం ఎలా చేయాలో నేర్చుకోవ‌చ్చు.. సుదీర్ఘ విరామం త‌ర్వాత‌.. రాఖీ ఈ రోజు నుంచి షూటింగ్‌లో పాల్గొంటున్నాడు’’ అంటూ యశ్ రాశాడు. వాస్తవానికి జూలైలో విడుద‌ల కావ‌ల‌సిన ఈ చిత్రం క‌రోనా వల్ల ఆగిపోయింది. అయితే సినిమా షూటింగ్ దాదాపు 70 శాతం వరకు పూర్తయినట్లు సమాచారం. అయితే షూటింగ్ కూడా తొందర్లోనే పూర్తికానున్నట్లు తెలుస్తోంది. Also read: Indian Air Force Day 2020: ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం: ఐఏఎఫ్ చీఫ్ భ‌దౌరియా


ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న కేజీఎఫ్ 2 చిత్రంలో శ్రీనిధి శెట్టి, సంజ‌య్ ద‌త్‌, ర‌వీనా టాండ‌న్‌, రావు ర‌మేష్  కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ సినిమాకు రవీ బస్రూర్‌ సంగీతమందిస్తుండగా.. హొంబలే ఫిలింస్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గ్యాంగ్‌స్ట‌ర్ డ్రామాగా తెరకెక్కిన కేజీఎఫ్ సినిమా ఎంత భారీ హిట్ అయిందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గ్యాంగ్‌స్టార్ డ్రామాతో కన్నడలో రూపొందిన ఈ సినిమా అన్ని భాషల్లో విడుదలై భారీ హిట్‌తో భారీ కలెక్షన్లను రాబట్టింది. అప్పటినుంచి ఈ రాఖీ భాయ్ గుర్తింపు అమాంతం పెరిగి పాన్ ఇండియా స్టార్‌గా రూపాంతరం చెందింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న కేజీఎఫ్ 2 చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. Also read: IndiGo విమానంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe