Indian Air Force Day 2020: ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం: ఐఏఎఫ్ చీఫ్ భ‌దౌరియా

భారత వైమానిక దళం దినోత్సవ ( Indian Air Force Day ) సంబ‌రాలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం ఘ‌జియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌లో ఐఏఎఫ్ (IAF) గ్రాండ్ పరేడ్‌ను నిర్వహించారు.

Last Updated : Oct 8, 2020, 01:07 PM IST
Indian Air Force Day 2020: ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం: ఐఏఎఫ్ చీఫ్ భ‌దౌరియా

Indian Air Force Day 2020: న్యూఢిల్లీ: భారత వైమానిక దళం దినోత్సవ ( Indian Air Force Day ) సంబ‌రాలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం ఘ‌జియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌లో ఐఏఎఫ్ (IAF) గ్రాండ్ పరేడ్‌ను నిర్వహించారు. ఈ వేడుక‌ల్లో ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ రాకేశ్ కుమార్ సింగ్ భ‌దౌరియా (Rakesh Kumar Singh Bhadauria), చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ (Bipin Rawat )‌, ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ మ‌నోజ్ ముకుంద్‌ నరవాణే ( Manoj Mukund Naravane ), నేవీ చీఫ్ అడ్మిర‌ల్ క‌రంబీర్ సింగ్‌ కూడా ఈ వేడుకలకు హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా వారితో కలిసి భదౌరియా పరేడ్‌ (grand parade)ను వీక్షించారు. అనంతరం చీఫ్ భ‌దౌరియా మాట్లాడుతూ.. భార‌త వైమానిక ద‌ళం 89వ సంవ‌త్స‌రంలోకి ప్రవేశించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేసి.. వైమానిక యోధులకు శుభాకాంక్షలు తెలియజేశారు. భార‌త వైమానిక ద‌ళం క్రమంగా బ‌లోపేతం అయి.. ఇప్పుడు మరింత రూపాంతరం చెందిందని తెలిపారు. కరోనా వైరస్ ప్ర‌పంచం అంతా వ్యాపిస్తుంటే, మ‌న దేశం స్థిరంగా స్పందిస్తూ చర్యలు తీసుకుందని, ఈ స‌మ‌యంలో వైమానిక ద‌ళ‌ యోధులు గొప్ప సామ‌ర్థ్యాన్ని ప్ర‌ద‌ర్శించారని ఆయన చెప్పారు. Also read: IndiGo విమానంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

ప్రస్తుతం మ‌న వైమానిక ‌శ‌క్తి అసాధారణ స్థితికి చేరిందని.. మ‌ల్టీ ఆప‌రేష‌న్లు నిర్వ‌హించే ఆధునిక యుగంలోకి ప్రవేశించిందని భదౌరియా పేర్కొన్నారు. దేశ సార్వ‌భౌమ‌త్వాన్ని, ప్ర‌యోజ‌నాల‌ను కాపాడేందుకు వైమానిక దళం ఎల్ల‌ప్పుడూ సంసిద్దంగా ఉంటుంద‌ని ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ భదౌరియా పేర్కొన్నారు. ఇటీవ‌ల ఉత్త‌ర స‌రిహ‌ద్దుల్లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ స‌మ‌యంలో వైమానిక ద‌ళాలు స్పందించిన తీరు అద్భుత‌మ‌ని గుర్తు చేశారు. అతి త‌క్క‌వ స‌మ‌యంలోనే మ‌న యుద్ధ సామాగ్రిని ఆ ప్రాంతంలో మోహ‌రించి.. భార‌త ఆర్మీకి కావాల్సిన తోడ్పాటును అందిచామ‌ని భ‌దౌరియా పేర్కొన్నారు. అనంతరం ఆకాశంలో వైమానిక దళాలు అద్భుత విన్యాసాలను ప్రదర్శించాయి. Also read: Sasikala: చిన్నమ్మకు భారీ షాక్.. 2వేల కోట్ల ఆస్తుల జప్తు

ఇదిలాఉంటే.. భారత వైమానిక దళాన్ని 1932 అక్టోబర్ 8న స్థాపించారు. నాటి నుంచి నేటి వరకు ప్రతి ఏడాది వైమానిక దళ వార్షికోత్సవాన్ని నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుంది. ఐఏఎఫ్ దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) కూడా ట్విట్ చేసి వైమానిక దళ యోధులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తల్లి భారతిని రక్షించడానికి మీ ధైర్యం, శౌర్యం, అంకితభావం అందరికీ స్ఫూర్తినిస్తుందంటూ ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. Also read: Fake universities list: 24 నకిలీ విశ్వవిద్యాలయాలను గుర్తించిన యూజీసీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

 

Trending News