బాలీవుడ్ నటి మందన కరిమి బాలీవుడ్ నిర్మాత మహేంద్ర ధరివాల్‌పై మీ టూ ఆరోపణలు చేశారు. క్యా కూల్ హై హమ్ 3 లాంటి అడల్ట్ కామెడీస్ చిత్రాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లలో తన అందాలు ఆరబోసి బాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న మందన కరిమి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తాజాగా మీ టూ ఆరోపణలతో మందన కరిమి మరోసారి వార్తల్లోకెక్కింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మందన ప్రస్తుతం కోకో కోలా సినిమాలో సెక్సీ క్వీన్ సన్నీ లియోన్‌తో కలిసి నటిస్తోంది. హారర్ కామెడి నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సన్నిలియోన్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తుండగా మందన కరిమి మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉన్నప్పుడే నిర్మాత మహేంద్ర ధరివాల్‌ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని మందన కరిమి ఆరోపించింది. మహేంద్ర ధరివాల్ తనను మానసికంగా వేధింపులకు గురిచేశాడని.. షూటింగ్‌లో తన వంతు సన్నివేశాలు అయిపోయిన తర్వాత కూడా మరో గంటసేపు ఎక్స్‌ట్రా ఉండాలని వేధించేవాడని సంచలన ఆరోపణలు చేసింది. 


Also read : Anchor Pradeep: యాంకర్ ప్రదీప్‌కి చిరంజీవి షాక్


తనకు వేరే పనులు ఉన్నాయని చెప్పినా వినిపించుకోకుండా తాను దుస్తులు మార్చుకునేటప్పుడు మహేంద్ర ధరివాల్ ( Mahendra Dhariwal ) ఏకంగా క్యారావాన్‌లోకి వచ్చి తనపై దురుసుగా ప్రవర్తించాడని వాపోయింది. అంతేకాకుండా తనపై నోటికి వచ్చినట్టు బూతులు తిట్టాడని మందన కరిమి ఆవేదన వ్యక్తంచేసింది. 


Also read : Student registration in TASK: టాస్క్‌లో మీ పేరు రిజిస్టర్ చేసుకున్నారా ?


ఇటీవల పాయల్ ఘోష్ ( Actress Payal Ghosh ) ఇదే తరహాలో అనురాగ్ కశ్యప్‌పై చేసిన ఆరోపణలు ఎంత సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్‌లో వార్తల్లోకెక్కిన మీ టూ ఆరోపణలు ఇవే. ఈసారి మందన కరిమి ( Mandana Karimi ) ఏం చేయనుందో వేచిచూడాల్సిందే మరి.


Also read : SBI Jobs: ఎస్బీఐలో 2000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలు, ముఖ్యమైన తేదీలు


Also read : SBI Jobs: ఎస్బీఐలో 2000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలు, ముఖ్యమైన తేదీలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.


మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి