Amitabh Bachchan About SRH Loss: ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి దాదాపు అన్నీ మ్యాచ్ లలోనూ.. గెలుస్తూ వచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్..ఫైనల్స్ దాకా వెళ్లి.. ఆఖరిలో ఓడిపోవడం అందరినీ బాధకి గురి చేసింది. చెన్నైలోని చపాక్ స్టేడియంలో ఆదివారం నాడు జరిగిన ఐపీఎల్ ఫైనల్స్ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. దీంతో ఎస్ ఆర్ హెచ్ టీం తో పాటు అభిమానులు కూడా డల్ అయిపోయారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే సన్ రైజర్స్ జట్టు ఓనర్ కావ్య మారన్ తన కళ్ళ ముందే జట్టు కూలిపోవడం చూసి తట్టుకోలేకపోయింది. తన కన్నీళ్లను ఆపుకోవడానికి.. ఎంత ప్రయత్నం చేసినా కుదరలేదు. దీంతో కెమెరాకి కనపడకుండా వెనకకు తిరిగి కంటతడి పెట్టుకుంది కావ్య. దీనికి సంబంధించిన వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. 


ఈ నేపథ్యంలో ఈ వీడియో పై బాలీవుడ్ సీనియర్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా స్పందించారు. "ఐపీఎల్ ఫైనల్ పూర్తయింది. కేకేఆర్ అద్భుతంగా ఆడి గెలిచింది. ఎస్ ఆర్ హెచ్ చాలా రకాలుగా అభిమానులను నిరాశకు గురిచేసింది. మంచి టీమ్ అయినప్పటికీ ఇప్పటిదాకా అద్భుతమైన అద్భుతంగా ఆడి గెలిచినప్పటికీ ఎస్ ఆర్ హెచ్ గెలవలేకపోయింది. కానీ అన్నిటికంటే బాధాకరమైన విషయం టీం ఓనర్ అయిన అందమైన యంగ్ లేడీ స్టేడియంలోనే టీం ఓడిపోయిన తర్వాత కన్నీళ్లు పెట్టుకోవడం. కెమెరాకి కనపడకుండా వెనక్కి తిరిగి తన బాధను బయటపెట్టింది. ఆమె కన్నీళ్లు చూస్తే నాకు బాధగా అనిపించింది. కానీ ఇది ముగింపు కాదు మై డియర్.. రేపు అనేది ఒకటి ఉంటుంది" అంటూ తన బ్లాగ్ లో కావ్య ను ఓదార్చారు అమితాబ్ బచ్చన్. 


ఇక సినిమాల పరంగా చూసినా కూడా అమితాబ్ బచ్చన్ చాలా బిజీగా ఉన్నారు. అమితాబచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్న కల్కి 2898 సినిమా జూన్ 27న థియేటర్లలో విడుదల కి సిద్ధం అవుతుంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు.


Read more: Romantic Dance: క్లాస్ లో టీచర్ తో స్టూడెంట్ రోమాంటిక్ డ్యాన్స్... చూస్తే తట్టుకోలేరు.. వీడియో వైరల్..


Read more: Bhootonwala mandir: ఒక్క రాత్రిలో దెయ్యాలు కట్టిన ఆలయం.. దీని విశిష్టతో ఏంటో తెలుసా..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter