Aishwarya Rajinikanth's Jewellery Stolen:సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్, నటుడు ధనుష్‌ను వివాహం చేసుకుని 18 సంవత్సరాల వివాహ బంధం తరువాత 2022లో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె చెన్నైలోని తేనాంపేటలోని సెయింట్ మేరీస్ రోడ్‌లోని తన నివాసంలో నివసిస్తోంది. అయితే తన ఇంట్లోని లాకర్‌లో సుమారు 60 సవర్ల నగలు మాయమైనట్లు ఫిబ్రవరి 27న తేనాంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో భారీ చోరీ జరిగిందని, చెన్నైలోని ఆమె నివాసం నుంచి 48 తులాల వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయని తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. లాకర్ లో పెట్టిన ఆభరణాలు కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారని, 2019లో  తన సోదరి సౌందర్య వివాహ వేడుకలో ఈ ఆభరణాలు ధరించినట్టు తెలిపిన ఆమె ఆ తర్వాత నుంచి బయటకు తీయలేదని పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఇక ఐశ్వర్య, తన వద్ద పనిచేస్తున్న ముగ్గురు సిబ్బందిని కూడా అనుమానితులుగా ఫిర్యాదులో పేర్కొందని తెలుస్తోంది.


ఐశ్యర్య ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 2019లో సోదరి సౌందర్య రజనీకాంత్ పెళ్లికి ధరించి విలువైన వస్తువులను లాకర్‌లో ఉంచినట్లు ఫిర్యాదులో పేర్కొన్న ఐశ్వర్య రజనీకాంత్ మూడుసార్లు ఇల్లు మారిన తర్వాత కూడా ఆమె గత నాలుగేళ్లుగా వాటిని బయటకు తీయలేదని పేర్కొంది.


చెన్నైలోని సెయింట్ మేరీస్‌ రోడ్‌లోని ఇల్లు, ధనుష్‌కు చెందిన సీఐటీ నగర్‌ ఇల్లు, పోయెస్‌గార్డెన్‌లోని రజనీ ఇంట్లో కూడా ఈ లాకర్లను అలాగే ఉంచారని ఇప్పుడు వచ్చిన కొత్త నివాసంలోకి వచ్చాక వాటిని ఓపెన్ చేసి చూస్తే నగలు కనిపించలేదని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. లాకర్‌లోని నగలు ఉన్న విషయం మాత్రమే కాకుండా తాళాలు ఎక్కడ భద్రపరిచారనే విషయం కూడా ఇంట్లో పనిచేస్తున్న ముగ్గురు పనివాళ్లకు తెలుసని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక సినీ రంగానికి చెందిన రజనీకాంత్ కుమార్తె నివాసంలో జరిగిన దొంగతనానికి సంబంధించిన వార్తలు నెటిజన్లను షాక్‌కి గురిచేశాయి.


Also Read: Niharika Konidela Disturbances: నిహారిక, చైతన్య జొన్నలగడ్డ మధ్య విభేదాలు.. అందుకే ఫోటోలు డిలీట్‌?


Also Read: Keerthy Suresh Gold Coins: బంగారు కీర్తి.. ఏకంగా 130 మందికి గోల్డ్ కాయిన్స్ పంపిణీ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook