Pushpa Movie releasing on OTT, read when and where to watch : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, డైరెక్టర్ సుకుమార్‌ కాంబోలో తెరకెక్కిన పాన్‌ ఇండియా మూవీ పుష్ప. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప‌‌ ది రైజ్‌ (Pushpa The Rise) టైటిల్‌తో డిసెంబర్‌‌ 17న రిలీజై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. బన్నీ (Bunny) అభిమానుల అంచనాలకు తగ్గట్లుగానే మూవీ ఉండడంతో పుష్ప రాజ్ (Pushpa Raj) హిట్ అందుకున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అల్లు అర్జున్ (Allu Arjun) ఫస్ట్ టైమ్ డీ గ్లామరస్‌ క్యారెక్టర్‌‌లో యాక్టింగ్ ఇరగదీశాడు. మాస్ పాత్రకు న్యాయం చేశాడు. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా మంచి కలెక్షన్స్ సాధించింది పుష్ప మూవీ. వరల్డ్ వైడ్‌గా ఇప్పటికే 300 కోట్ల రూపాయల ట్రేడ్‌ మార్క్‌ దాటేసింది.



పుష్ప మూవీ త్వరలో ఓటీటీలో (Pushpa movie on OTT) కూడా రిలీజ్‌కానుందని టాక్. మరో మూడు రోజుల్లో అంటే జనవరి 7వ తేదీన అమెజాన్‌ ప్రైమ్‌లో (Amazon Prime) పుష్ప మూవీ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 



కాగా పుష్ప తెలుగు వెర్షన్‌ను ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో (Aha OTT Platform) రిలీజ్‌ చేస్తారనే టాక్ కూడా నడుస్తోంది. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మాత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో పుష్ప మూవీ స్ట్రీమింగ్ (Pushpa Movie OTT streaming) అవుతుందని సమాచారం. త్వరలోనే పుష్ప యూనిట్ నుంచి దీనిపై అధికారిక ప్రకటన రానుంది.



Also Read : IPL 2022 Mega Auction: ఐపీఎల్ 2022 మెగా వేలంకు డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా? హైదరాబాద్‌కు నిరాశే!!   


ఎర్ర చందనం (red sandalwood) స్మగ్లింగ్‌ (Smuggling) బ్యాక్‌ డ్రాప్‌తో తెరకెక్కిన పుష్ప మూవీలో బన్నీ సరసన రష్మిక హీరోయిన్‌గా నటించింది. సునీల్‌, ఫహద్‌ ఫాజిల్‌, అనసూయ తదితరులు కీ రోల్స్ ప్లే చేశారు. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ అందించారు. ముత్తంశెట్టి మీడియా, మైత్రీ మూవీ మేకర్స్‌ వారు పుష్ప‌‌ (Pushpa) మూవీని నిర్మించారు.



ఇక పుష్ప మూవీతో బాలీవుడ్‌లోకి (Bollywood‌) కూడా ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. తాజాగా బాలీవుడ్‌లో రిలీజైన 83 మూవీ కంటే పుష్ప మూవీనే కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుందట. రష్మిక (Rashmika Mandanna) కూడా ఈ మూవీతో తన స్టార్‌‌డమ్‌ను మరింత పెంచుకుంది. డీ గ్లామరస్ పాత్రలో అదరగొట్టేసింది ఈ నేషనల్ క్రష్. సినిమాలోని ప్రతి పాత్రకు న్యాయం చేస్తూ మూవీని తెరకెక్కించారు సుకుమార్.



Also Read : Delhi Weekend Curfew: దేశ రాజధానిలో కరోనా ఉద్ధృతి.. ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.