Delhi Weekend Curfew: ఢిల్లీలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తుంది. గడిచిన మూడు రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో 10 వేలకు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో వైరస్ వ్యాప్తిని కట్టడిచేసేందుకు ఇప్పటికే 'ఎల్లో అలర్ట్' ను అమలు చేస్తోన్న ఢిల్లీ సర్కారు.. తాజాగా మరిన్ని కఠిన ఆంక్షలు విధించింది.
కొవిడ్ తీవ్రత నేపథ్యంలోనే ఈ వారాంతం నుంచి వీకెండ్ కర్ఫ్యూను అమల్లోకి తెస్తున్నట్లు దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మంగళవారం వెల్లడించారు. ప్రతి శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూను అమలు చేయాలని ఆప్ ప్రభుత్వం నిర్ణయించింది.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. నిన్న ఒక్క రోజే దేశ రాజధానిలో 4 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 6.46 శాతానికి చేరింది. గతేడాది మే తర్వాత పాజిటివిటీ రేటు ఈ స్థాయికి పెరగడం మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం.
దీంతో కరోనా పరిస్థితులపై దిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ నేడు (జనవరి 4) సమావేశమైంది. వరుసగా రెండు రోజుల పాటు పాజిటివిటీ రేటు 5శాతం దాటడంతో దిల్లీలో 'రెడ్ అలర్ట్' ఆంక్షలు విధించే అంశంపై అధికారులు సమీక్షించారు. ఇందులో భాగంగానే వారాంతపు కర్ఫ్యూ విధించాలని సిఫార్సు చేశారు. ఈ సిఫార్సులకు ఆప్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ శుక్రవారం నుంచే దీన్ని అమలు చేయనున్నట్లు ఢిల్లీ డిప్యూటీ సీఎం తెలిపారు.
వీకెండ్ కర్ఫ్యూ మార్గదర్శకాలు ఇవే
1) ఎమర్జెన్సీ సేవలు మినహా పూర్తిగా కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.
2) షాపింగ్ మాల్స్, సెలూన్స్ వంటి అత్యవసరం సేవల కిందకు రాని దుకాణాలు మూతబడతాయి.
3) కర్ఫ్యూ నేపథ్యంలో రవాణా ఆంక్షలు సహా వివాహాది శుభకార్యాలు, అంత్యక్రియల్లో పాల్గొనే వారిపై పరిమితులు ఉంటాయి.
4) ప్రభుత్వ కార్యాలయ సిబ్బంది ఇంటి నుంచే పనిచేయాల్సి ఉంటుంది.
5) ప్రైవేట్ కార్యాలయాల్లో 50 శాతం మంది సిబ్బందితో కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు వీలుంది.
ఇప్పటికే ఢిల్లీలో 'ఎల్లో అలెర్ట్' అమలులో ఉన్న కారణంగా స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాళ్లు, జిమ్ సెంటర్లు మూతపడ్డాయి. దుకాణాలు, మాల్స్‌ను సరి-బేసి పద్ధతిలో తెరుచుకునేందుకు అనుమతినిచ్చారు. మెట్రో, బస్సులను సగం సామర్థ్యంతో నడుపుతున్నారు.
Also Read: Punjab Night Curfew: కోవిడ్ థర్డ్‌వేవ్ సంకేతాల నేపధ్యంలో పంజాబ్‌లో నైట్‌కర్ఫ్యూ
Also Read: India Corona Update: దేశంలో మరోసారి పెరిగిన కరోనా కేసులు.. 37,379 కేసులు, 124 మరణాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి