Pushpa Movie Release Date: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్న తొలి భాగం డిసెంబరు 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం సినిమా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సినిమా రిలీజ్ దగ్గర పడనుండడం వల్ల చిత్ర ప్రమోషన్స్ ను మేకర్స్ శరవేగంగా మొదలుపెట్టారు. గత కొన్ని నెలలుగా సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ప్రేక్షకుల్లో సినిమా క్రేజ్ పెంచేస్తున్నారు. ఈ ఏడాది అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా విడుదలైన గ్లింప్స్ తో ప్రమోషన్స్ షురూ అయ్యాయి.


ఆ తర్వాత సినిమాలోని పాత్రలను పరిచయం చేయడం సహా తొలి లిరికల్ సాంగ్ ‘దాక్కో దాక్కో మేక‘ను ఆగస్టు 13న చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ పాటకు ఫ్యాన్స్ నుంచి విపరీతమైన ఆదరణ దక్కింది. ఆ తర్వాత వరుసగా ‘శ్రీవల్లీ’, ‘సామి సామి‘, ‘ఏ బిడ్డా ఇది నా అడ్డా‘ పాటలు సోషల్ మీడియాలో అదరగొడుతున్నాయి.


ఇప్పుడా సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ట్రైలర్ ను డిసెంబరు 6న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని సోమవారం ఉదయం ఓ ప్రకటనలో తెలియజేశారు. ఇక ఈ పోస్ట‌ర్‌తో రిలీజ్ డేట్‌పై క్లారిటీ కూడా వ‌చ్చింది. మొన్న‌టి వ‌ర‌కు డిసెంబ‌ర్ 24న విడుద‌ల కానున్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. కానీ, డిసెంబ‌ర్ 17నే ‘పుష్ప‘ సినిమా ప్రేక్ష‌కుల‌ను తీసుకురానున్నట్లు తెలుస్తుంది. ‘పుష్ప‘ ట్రైల‌ర్ వేడుకను బాలీవుడ్ లో నిర్వహించనున్నారని సమాచారం. ఈ కార్యక్రమానికి ఓ బాలీవుడ్ స్టార్ హీరో సహా పలువురు అతిథులు హాజరవనున్నారని తెలుస్తోంది.  



ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన్ హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది. వీరితో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్, యాంకర్ అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో మెయిన్ విలన్ ఫహద్ ఫాసిల్ అంటూ ప్రచారం జరుగుతూ ఉండగా అది నిజం కాదని మొదటి భాగం చివర్లో ఆయన వస్తాడు అని సునీలే సినిమాలో మెయిన్ విలన్ అని స‌మాచారం. చిత్రంలో సునీల్ మంగళం శ్రీనుగా, అనసూయ దాక్షాయణిగా స‌రికొత్త లుక్‌లో సంద‌డి చేయ‌నున్నారు.


Also Read: The Ghost: కాజల్‌, అమలా కాదు.. నాగార్జునకు జోడీగా నటించేదెవరో తెలుసా?


Also Read: Anchor Ravi: అసలు కథ వేరే..? బిగ్‌బాస్ హౌస్ నుంచి యాంకర్ రవి ఎలిమినేషన్‌ వెనుక..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook