Anchor Ravi: అసలు కథ వేరే..? బిగ్‌బాస్ హౌస్ నుంచి యాంకర్ రవి ఎలిమినేషన్‌ వెనుక..

Anchor Ravi Remuneration : బిగ్‌బాస్ హౌస్ నుంచి యాంకర్ రవి ఎలిమినేషన్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రవికి అన్యాయం చేశారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రవి ఎలిమినేషన్ వెనక అసలు కథ వేరే ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.    

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 29, 2021, 10:02 AM IST
  • బిగ్‌బాస్ హౌస్ నుంచి యాంకర్ రవి ఎలిమినేషన్‌పై రకరకాల ఊహాగానాలు
    రెమ్యునరేషనే ఎలిమినేషన్‌కు కారణమని గుసగుసలు
    రవి ఎలిమినేషన్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్
Anchor Ravi: అసలు కథ వేరే..? బిగ్‌బాస్ హౌస్ నుంచి యాంకర్ రవి ఎలిమినేషన్‌ వెనుక..

Anchor Ravi Remuneration : బిగ్‌బాస్ హౌస్ (Biggboss 5) నుంచి యాంకర్ రవి ఎలిమినేట్ (Anchor Ravi Elimination) అవడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. రవి టాప్-5లో ఉంటాడని చాలామంది భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అనూహ్యంగా రవిని బయటకు పంపించేశారు. ఈ నిర్ణయంపై రవి ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఎక్కడో ఏదో జరిగిందని మండిపడుతున్నారు. అదే సమయంలో రవి ఎలిమినేషన్‌కు సంబంధించి రకరకాల ఊహాగానాలు తెర పైకి వస్తున్నాయి. రవి ఎలిమినేషన్‌కు అతని రెమ్యునరేషన్‌కు లింకు ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

బిగ్‌బాస్ హౌస్‌లో (Biggboss 5) ఉన్న కంటెస్టెంట్లలో అత్యధిక రెమ్యునరేషన్ యాంకర్ రవిదే (Anchor Ravi Remuneration) అన్న వాదన వినిపిస్తోంది. అతనికి రోజుకు రూ.1.3లక్షలు చొప్పున చెల్లిస్తున్నారట. రవి బిగ్‌బాస్ హౌస్‌లో దాదాపు 85 రోజులు (సెప్టెంబర్ 5 నుంచి నవంబర్ 27) ఉన్నాడు. అంటే, ఈ లెక్కన ఇప్పటికే అతని ఖాతాలో రూ.1 కోటి పైచిలుకు జమయ్యాయి. బిగ్‌బాస్ విజేతకు ఇచ్చే ప్రైజ్‌మనీ కంటే ఇది రెట్టింపు. ఈ కారణంతోనే రవిని బిగ్‌బాస్ నిర్వాహకులు బయటకు పంపించారనే ప్రచారం జరుగుతోంది. ఎలాగూ బిగ్‌బాస్ షో కూడా ముగింపుకు వచ్చింది కాబట్టి... ఇక రవిని సాగనంపడమే బెటర్ అని నిర్వాహకులు భావించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రవి (Anchor Ravi) రెమ్యునరేషన్ విషయంలో అధికారిక సమాచారమేమీ లేనప్పటికీ... అటు ఫ్యాన్స్‌లో, ఇటు సోషల్ మీడియాలో ఈ తరహా చర్చలు జరుగుతున్నాయి.

ఇక బిగ్‌బాస్ షో (Biggboss 5) నుంచి ఎలిమినేట్ అవడం తనకూ షాకింగ్‌గానే ఉందని యాంకర్ రవి చెప్పడం గమనార్హం. 'హౌస్ నుంచి ఎందుకు పంపించారో నాకే తెలియదు. నాకు ఓట్లు తక్కువగా ఉన్నాయనే విషయాన్ని కూడా నమ్మాలనుకోవట్లేదు. ఇది తప్పు తీర్పు అని జనాలు భావిస్తున్నారు. ఆ తప్పు ఏంటి... ఎందుకిలా జరిగిందోనని విశ్లేషించుకోవాలి. జనాలకు ఏ కంటెంట్ చూపించారో నాకు తెలియదు. హౌస్ లోపల నేను చాలా క్లారిటీతో ఆడాను. బాగా పెర్ఫామెన్స్ చేసిన ఇద్దరు, ముగ్గురిలో నేనూ ఒకడిని. అలాంటి నన్ను బయటకు పంపించడం బాధ కలిగించింది. అయితే అభిమానుల నుంచి వచ్చిన స్పందన చూశాక నేనే గెలిచానని భావిస్తున్నాను. వాళ్లెవరో నన్ను గెలిపించడం కాదు.. అభిమానులే నన్ను గెలిపించారు.' అని బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం యాంకర్ రవి చెప్పుకొచ్చారు. 

Also Read: Pushpa trailer : పుష్ప మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్... ట్రైలర్‌ అనౌన్స్‌మెంట్‌

కాగా, యాంకర్ రవి ఎలిమినేషన్‌ అతని అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. అన్నపూర్ణ స్టూడియో గేటు ఎదుట వారు నిరసనకు దిగారు. యాంకర్ రవికి (Anchor Ravi) ఎన్ని ఓట్లు పడ్డాయో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ కొద్దిపాటి ఉద్రిక్తత చోటు చేసుకుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News