Online Tickets Issue: ఆన్‌లైన్ టికెట్లతో నీకు వచ్చిన నష్టమేంటని మండిపడ్డ మంత్రి
Online Tickets Issue: ఆన్‌లైన్ సినిమా టికెట్ల వివాదం ముదురుతోంది. ఆన్‌లైన్ టికెట్లపై పపన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దీటైన సమాధానమిచ్చారు. ఆన్‌లైన్ టికెట్ల విధానంతో నీకొచ్చిన నష్టమేంటని ప్రశ్నించారు.
Online Tickets Issue: ఆన్‌లైన్ సినిమా టికెట్ల వివాదం ముదురుతోంది. ఆన్‌లైన్ టికెట్లపై పపన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దీటైన సమాధానమిచ్చారు. ఆన్‌లైన్ టికెట్ల విధానంతో నీకొచ్చిన నష్టమేంటని ప్రశ్నించారు.
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్(Saidharam Tej)మూవీ రిపబ్లిక్ ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ ఆన్‌లైన్ టికెట్ల విధానంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని మంత్రి శ్రీనివాస్(Vellampalli Srinivas) స్పష్టం చేశారు. చిరంజీవి, నాగార్జున లాంటి సినీ పెద్దలు సినిమా థియేటర్లు, టికెట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన ఇచ్చారన్నారు. సినీ పెద్దలతో సంబంధిత మంత్రి చర్చలు జరుపుతున్నారని గుర్తు చేశారు. బ్లాక్ టికెట్లను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం తప్పా అని ప్రశ్నించారు.
థియేటర్ టికెట్ల ఆన్‌లైన్ విధానం(Online Tickets Issue)ప్రవేశపెడితే నీకు వచ్చిన నష్టమేంటని నిలదీశారు. పావలా కళ్యాణ్ గురించి మాట్లాడటం వేస్ట్ అని..రాష్ట్ర ప్రభుత్వం, సినిమా పరిశ్రమ మద్య దూరం పెంచేందుకు పవన్ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. మా ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నట్టుగా ఉందన్నారు. నీవు అడ్డంగా కోట్లు సంపాదించుకోవాలా అని విరుచుకుపడ్డారు. రెండేళ్లుగా ప్రజలు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తాట తీశారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. సినీ పరిశ్రమలో దోపిడీని ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని..అసలు సినిమా కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడటమేంటని అడిగారు. పవన్ కళ్యాణ్..రాజకీయాల్లో ఓ పనికిమాలిన స్టార్ అని అభివర్ణించారు. ముఖ్యమంత్రి జగన్‌పై(Ap cm ys jagan)తప్పుడు వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు.
Also read: Kondapolam trailer: ఉప్పెన హీరో కొండపొలం ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook