Guntur Kaaram Deleted Scenes: సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరు ఎందుకు.. పాపులర్ అవుతారో అర్థం కాకుండా పోతోంది. ఒక చిన్న విషయాన్ని ఎవరన్నా కొంతమంది వీడియో చేసి ఒక పది రిల్స్ చేస్తే చాలు ఇక అవి ఎంతోమందిని ఓవర్ నైట్ సెలబ్రిటీస్ గా మార్చేస్తు ఉన్నాయి. దీనివల్ల నిజంగా ప్రతిభ ఉన్న కొంత మందికి గుర్తింపు వస్తూ ఉంటే.. మరి కొంతమంది మాత్రం ఏమీ చేయకపోయినా.. నెగిటివ్ పనుల వల్ల కూడా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలా ఫేమస్ అయిన అమ్మాయి కుషిత. ఇంస్టాగ్రామ్ లో రోజుకి 10 రీల్స్ చేస్తూ ఉన్న తనకి రాని క్రేజ్.. సడన్ గా ఒక రోజు తాను చేసిన కామెంట్స్ మీడియాలో వైరల్ అవ్వడం వల్ల వచ్చేసింది. మెగా డాటర్ నిహారిక పబ్ ఇష్యూ జరిగినప్పుడు.. ఆ ఇష్యూ లో కుషిత అనే పేరు కూడా ఎక్కువగా వినిపించింది.. అందుకు ముఖ్య కారణం ఆ అమ్మాయి పబ్బుకి బజ్జీలు తినడానికి వెళ్లాను అని చెప్పడమే. ఇక అప్పటినుంచి సోషల్ మీడియా వారు తనని తెగ పాపులర్ చేసి ఆఖరికి బజ్జీల పాపా అని పేరు కూడా పెట్టేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అప్పటికే కొన్ని ఆల్బమ్ సాంగ్స్ లో.. యూట్యూబ్ సీరస్ లో కనిపించిన ఈ తెలుగు అమ్మాయి బజ్జీల పాపగా అందరి దగ్గర ఫేమస్ అయిపోయింది. ఇక కుషిత కల్లపు.. ఆ మధ్య మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’లో కూడా ఛాన్స్ అందుకున్నట్లు వార్తలు వచ్చాయి. న్యూస్ మాత్రమే కాదు, కుషిత కూడా.. ఒక ఫోటో షేర్ చేస్తూ గుంటూరు కారం సెట్స్ అంటూ పోస్టు చేసింది. కట్ చేస్తే.. సినిమాలో మాత్రం తను ఎక్కడ కనిపించలేదు. దీంతో ఆమె అభిమానులు తెగ ఫీల్ అయ్యారు. ఇక ఈ విషయం గురించి ఈ మధ్య ఇచ్చిన ఒక మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చింది కుషిత.


కుషిత నటిస్తున్న కొత్త సినిమా ‘బాబు నెంబర్ వన్ బుల్‌షిట్ గాయ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ విలేకర్ల సమక్షంలో జరిగింది. ఈ ఈవెంట్ లో గుంటూరు కారం సినిమా గురించి కుషిత మాట్లాడుతూ..“నేను మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో నటించాను. నాతో నాలుగు రోజులు షూటింగ్ చేసారు. కానీ ఆ చిత్రం రిలీజైన తరువాత నా సీన్స్ కనిపించకపోవడంతో నేను చాలా షాక్ అయ్యాను. సినిమా చూసిన వెంటనే మూవీ యూనిట్ ని ఆ విషయం గురించి అడిగాను కూడా. అయితే వాళ్ళు చెప్పిందేంటంటే, నాతో పాటు యాక్ట్ చేసినవారిది కూడా తీసేసినట్లు చెప్పుకొచ్చారు. మొదటి ఆ విషయం విని చాలా బాధ పడ్డాను. కానీ సినీ పరిశ్రమలో ఇలా జరగడం చాలా కామన్ అని రిలాక్స్ అయ్యాను” అంటూ చెప్పుకొచ్చారు. 


ప్రస్తుతం బజ్జీల పాప కుషిత చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.


 



Also Read: TDP JanaSena: పార్టీ వీడేవారికి చంద్రబాబు కీలక సూచన.. భవిష్యత్‌కు 'గ్యారంటీ' ప్రకటన


Also Read: New Party: ఆంధ్రప్రదేశ్‌లో మరో పార్టీ.. స్థాపించింది ఎవరు? ఎన్నికల్లో పోటీ చేస్తుందా?



 


 


 


 


 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook