BiggBoss Telugu Season 5: ప్రముఖ రియాలిటీ షో తెలుగు బిగ్‌బాస్ సీజన్ 5 త్వరలో ప్రారంభం కానుంది. బిగ్‌బాస్ సీజన్ 5లో పాల్గొనే కంటెస్టెంట్ల విషయమై ఇప్పటికే చాలాపేర్లు ముందుకొచ్చినా..ఇప్పుడు తాజాగా మరో జాబితా వైరల్ అవుతోంది. ఆ జాబితాలో ఉన్నదెవరో పరిశీలిద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 (BiggBoss Telugu Season 5)ఎప్పుడు ప్రారంభమయ్యేది ఖరారైంది. సెప్టెంబర్ నెలలో ప్రారంభం కానున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో పాల్గొనబోయే కంటెస్టెంట్లను ఆగస్టు 22 నుంచి క్వారంటైన్‌కు పంపించనున్నారు.ఇప్పటి వరకూ బిగ్‌బాస్‌లో పాల్గొననున్న కంటెస్టెంట్ల విషయంలో చాలా పేర్లు విన్పించాయి. కానీ ఏదీ అధికారికంగా ఖరారు కాలేదు. ఇప్పుడు తాజాగా మరో కొత్త జాబితా వైరస్ అవుతోంది.బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో పాల్గొనబోయేది వీళ్లేనని తెలుస్తోంది. 


ప్రస్తుతం వైరల్ అవుతున్న కొత్త జాబితాలో(BiggBoss Telugu Season 5 New list)యాంకర్ రవి, ఆర్జే కాజల్, శ్వేతా వర్మ, లహరి షారి, కమెడియన్ లోబో, సిరి హన్మంతు, నటి ప్రియ, కార్తీకదీపం ఉమాదేవి, 7ఆర్ట్స్ సరయు, నటుడు మానస్ షా, మోడల్ జస్వంత్, నటుడు సన్నీ, విశ్వ, టీవీ 9 యాంకర్ ప్రత్యూష, ఆట సందీప్, రఘు పేర్లు ఉన్నాయి.ఇప్పటి వరకూ విన్పించిన యాంకర్ వర్షిణి, ట్రాన్స్‌జెండర్ ప్రియాంక, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్, యానీ మాస్టర్, నిఖిల్ పేర్లు ఈ కొత్త జాబితాలో లేవు. ఇప్పటికే బిగ్‌బాస్ కొత్త ప్రోమో విడుదలైంది. బోర్‌డమ్‌కు చెప్పేయ్ గుడ్ బై..వచ్చేసింది బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 అంటూ నాగార్జున((Nagarjuna)మరోసారి ఎంట్రీ ఇస్తున్నాడు. 


Also read: పిచ్చి పీక్స్.. ఆర్జీవీతో అషురెడ్డి.. వైరలవుతున్న వీడియో క్లిప్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి