పిచ్చి పీక్స్.. ఆర్జీవీతో అషురెడ్డి.. వైరలవుతున్న వీడియో క్లిప్!

రామ్‌ గోపాల్‌ వర్మ- అషురెడ్డి ఇద్దరు ఉన్న ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఆ వీడియోలో ఏముందో, ఎందుకు వైరల్ అయిందో మీరే చూసేయండి మరీ!

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 19, 2021, 06:57 PM IST
  • వైరలవుతున్న రామ్‌ గోపాల్‌ వర్మ- అషురెడ్డి వీడియో
  • వింత చేష్టలతో మరోసారి వార్తల్లోకి ఎక్కిన ఆర్జీవీ
  • వీడియో క్లిప్ పోస్ట్ చేసిన అషురెడ్డి
పిచ్చి పీక్స్..  ఆర్జీవీతో అషురెడ్డి.. వైరలవుతున్న వీడియో క్లిప్!

రామ్‌ గోపాల్‌ వర్మ (Ram Gopal Varma)... పరిచయం అవసరం లేని పేరు.. సమాజంలో జరిగే అన్ని విషయాలపై విభిన్నమైన కామెంట్స్  చేస్తూ ఎప్పుడు వార్తల్లో ఉంటాడు. ముఖ్యంగా ఆర్జీవీ (RGV) చేసే కామెంట్లు ఎక్కువ శాతం మహిళలపై ఉండటం.. అవి వైరల్ అవటంతో పాటు, ఎక్కువగా వివస్పదాలకు దారి తీస్తుంటాయి. 

రామ్‌ గోపాల్‌ వర్మ ఎప్పుడు ఏం చేస్తాడో, ఎవరిపై కామెంట్స్ చేస్తాడో తెలియదు. అయితే ఈ వివాదాస్పద దర్శకుడి ఇంటర్వ్యూ చేసిన ప్రతి మహిళ యాంకర్ ఫేమస్ అవ్వటమే కారణంగా ఆర్జీవీ ఇంటర్వ్యూ కోసం లేడి యాంకర్లు క్యూ కడుతుంటారు. ఉదాహరణకు బిగ్‌బాస్‌ ఫేం అరియానా (Bigg Boss fame Ariyana), ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసిన వెంటనే ఆ వీడియో వైరల్ అవటం, తనకి బిగ్‌బాస్‌ రియాల్టీ షోలో (Bigg Boss Reality Show) అవకాశం రావటం.. ఇవన్ని రామ్‌ గోపాల్‌ వర్మ కామెంట్స్ కి  ఉన్న క్రేజ్. 

Aslo Read: India Corona update: దేశంలో పెరిగిన కరోనా కేసులు... నమోదైన 36,401 కేసులు
ఇపుడు ఇవన్ని ఎందుకు అనుకుంటున్నారా?? అయితే  మరో బిగ్‌బాస్‌ ఫేం అషు రెడ్డి (Bigg Boss fame Ashu Reddy) తెలుసుగా, "జూనియర్ సమంత"గా (Samantha) పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఈ అమ్మాయి రామ్‌ గోపాల్‌ వర్మని ఇంటర్వ్యూ చేసింది. 

మాములుగానే కామెంట్స్ చేసే ఆర్జీవీ.. ఇక అందమైన లేడీ యాంకర్ వస్తే... వర్మ చేసే చేష్టలకు, ప్రవర్తనలు ఎలా ఉంటాయో ఉహించుకోండి. అయితే.. వీరి మధ్య జరిగిన ఇంటర్వ్యూ వీడియో బయటకి రాకున్న ఓ క్లిప్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరలైపోయింది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ashu Reddy (@ashu_uuu)

 

Aslo Read: Gandhi Hospital Gang Rape: బయటకి వచ్చిన సంచలన నిజాలు.. మహిళ ఇష్టంతోనే!

ఈ క్లిప్ లో అషు రెడ్డి కుర్చీలో కూర్చొని ఉండగా... వర్మ కిందకి దిగి అషు రెడ్డి (Ashu Reddy) కాళ్లను ఫోటో దించుతూ ఫోటోగ్రఫీ టాలెంట్‌ని చూపించేసాడు.. మాములుగా అయితే ఇలాంటి చేష్టలకి యాంకర్స్ కి కోపం రావటం సహాజం. కానీ కుర్చీలో కూర్చొన్న అషు రెడ్డికి కాసేపు ఏం చేస్తున్నాడో అర్థం అవనట్టు నటించిన.. తరువాత ఫోన్ తీసి నవ్వటం... ఈ క్లిప్ ను స్వయంగా తనే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయటం... ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతుంది.. ఆ వీడియో మీరు కూడా చూసేయండి మరీ!!

 

 

Trending News