Brahmamudi 12th March Episode: చేతిలో చేయివేసుకుని ప్రమాణాలు చేసుకన్న అప్పుకళ్యాణ్.. రాజ్‌కు విడాకులు ఇవ్వడానికి రెడీ అయిన కావ్య..
Brahmamudu 2024 March 12 Episode: ఈరోజు ఎపిసోడ్‌లో తమ్ముడన్నయ్య అంటూ రాజ్ కావ్య భాస్కర్లతోపాటు తాను వెల్లడానికి ప్రయత్నిస్తాడు. లిఫ్ట్ ఇవ్వమని అడుక్కోనికి వచ్చా తమ్ముడన్నయ్య అంటూ భాస్కర్‌కు రిక్వెస్ట్ చేస్తాడు కారు నాదే అయినా నిర్ణయం మీదే అని అడుగుతాడు.
Brahmamudu 2024 March 12 Episode: ఈరోజు ఎపిసోడ్‌లో తమ్ముడన్నయ్య అంటూ రాజ్ కావ్య భాస్కర్లతోపాటు తాను వెల్లడానికి ప్రయత్నిస్తాడు. లిఫ్ట్ ఇవ్వమని అడుక్కోనికి వచ్చా తమ్ముడన్నయ్య అంటూ భాస్కర్‌కు రిక్వెస్ట్ చేస్తాడు కారు నాదే అయినా నిర్ణయం మీదే అని అడుగుతాడు. కారు ఎక్కబోతున్న కావ్యను మీ బావ పక్కన కూర్చో నేను మధ్యలో వచ్చాను మధ్యలో వెళ్లిపోతాను అంటాడు రాజ్. చూశావా ఎంత బ్రాడ్ మైండ్ తో వారిని కలుపుతున్నా అని అంతరాత్మతో చెబుతాడు. నువ్వు మనస్సులో ఎంత కుళ్లు కుంటున్నావో అంతరాత్మకు నాకు తెలుసు అంటాడు. కారు వెళ్తూ ఉంటుంది. ఇంతకి మీటింగ్ ఎక్కడ అడుగుతాడు రాజ్. బుజ్జీతో వెళ్తున్నా కదా మీటింగ్ కేన్సల్ అంటాడు భాస్కర్. వావ్ గుడ్ డిసిషన్ అంటాడు రాజ్. బిత్తరపోయి చూస్తుంటారు కావ్య భాస్కర్లు. సాంగ్ పెట్టమని బావ.. బావ బంతిపూవా.. అనే పాటను పెడతాడు. పాటను ఎంజాయ్ చేస్తుంటాడు రాజ్ వీడికి ఏమైంది అన్నట్లు ఆశ్చర్యపోయి చూస్తుంటారు కావ్య భాస్కర్. ఇక కార్ దిగుతూ నేనేమనుకోను రెస్టారెంట్ కు వెళ్లండి, సినిమాకు వెళ్లండి మీ ఇష్టం ఎంజాయ్ అంటూ కారు దిగి వెళ్లిపోతాడు రాజ్.
నాతో పెట్టుకుంటారా? అంటూ ఓ కార్ వెనుకనుంచి వారిని చూసి వెళ్లిపోతాడు రాజ్. దీంతో కావ్య అక్కడి నుంచే అమ్మమ్మకు ఫోన్ చేస్తుంది. మన నాటకానికి మధ్యలోనే బ్రేక్ వేసి ఆయన కొత్తనాటకానికి తెరతీశాడు. దీంతో అమ్మమ్మ అర్థమైంది వాడు బయట పడకూడదని అలా చేస్తున్నాడు అంటుంది. ఇంటికి రండి నేను ఇంటి నుంచే నాటకం నడిపిస్తాను అంటుంది. దీంతో కావ్య భాస్కర్లు ఇంటికి బయలుదేరతారు. రాజ్ ను తాతయ్యకు ట్యాబ్లెట్స్ అయిపోయాయి వెంటనే తీసుకురా అని ఫోన్ చేస్తుంది అమ్మమ్మ.. అలాగే అని రాజ్ కూడా ఇంటి ముఖం పడతాడు.
ఇక పార్క్‌లో అప్పు కళ్యాణ్ లు కలుసుకుంటారు. ఇంటికి వెళ్లబుద్ధవ్వట్లేదు అంటాడు. దీంతో అప్పు నువ్వు అతిగా ఆలోచిస్తున్నావేమో అంటుంది. నన్ను నా కవితలను చూసి ఇష్టపడింది అనుకున్నా.. కానీ, ఇంట్లో అనామికతోనే నాకు పెద్ద సమస్యగా మారింది అంటాడు కల్యాణ్. తన బాధ కూడా నువ్వు అర్థం చేసుకోవాలి అంటుంది అప్పు. కావాల్సినంత డబ్బు నాదగ్గర ఉంది మనస్సుకు నచ్చిన పని చేయకూడదా? అంటుంది. నీ భార్య గురించి ఇలా తక్కువ చేసి మాట్లాడకూడదు అంటుంది. నీకు రెండు దార్లున్నాయి నువ్వు నిరూపించుకోవడం లేదా ఆఫీసుకు వెళ్లడం అంటుంది అప్పు.ఇక ఇంటికి వచ్చిన రాజ్ ను అమ్మమ్మ కావ్య భాస్కర్లు ఎక్కడ అని అడుగుతుంది. తెలీదు ఇప్పుడేం రారు అంటాడు అప్పుడే కావ్య భాస్కర్లు వస్తారు. సిటీలో ట్రాఫిక్ వల్ల మనస్సు మార్చుకుని వెనక్కి తిరిగివచ్చాం అంటారు. ఎందుకు? అంటాడు రాజ్ అదేంటి రాజ్ నీ భార్యను నువ్వు తీసుకెళ్లాలి కాని వాళ్ల బావను తీసుకెళ్లు అని గదిలోకి వెళ్తాడు రాజ్.
దీంతో ముగ్గురు కలిసి మరో ప్లాన్ వెద్దామని ఆలోచిస్తారు.
ఇదీ చదవండి: గేర్ మార్చిన రాజ్.. కావ్యకు అమెరికా పాస్ట్‌పోర్ట్.. అనామికను కాదని అప్పుతో కలిసిపోయిన కల్యాణ్..
కారులో ధాన్యలక్ష్మి, అనామికలు వెళ్తుంటారు. పార్కులో అప్పు కల్యాణ్‌లు మాట్లాడుతుంటారు. నాకు ఎప్పుడూ తోడుగా ఉంటా అని ప్రామిస్ చేయ్ అంటాడు కల్యాణ్ ప్రామిస్ చేస్తుంది అనామిక అప్పుడే అదే పార్కు గుండా వెళ్తున్న అనామిక కార్ ఆపి ధాన్యలక్ష్మికి వారిని చూపిస్తుంది. నీకెప్పుడు కష్టం వచ్చినా నేనుంటాడను నీపక్కన నిలబడతాను అంటుంది అప్పు మీ కళ్లతో చూశారు కదా.. ఇప్పుడైనా నమ్మండి అని అనామిక ధాన్యలక్ష్మికి నూరిపోస్తుంది. పెళ్లైన మగాడితో తిరగడానికి సిగ్గులేదు. మా పెల్లి పెటాకులు చేసి మళ్లీ ఆ ఇంటి కోడలు అయిపోదామని ప్లాన్ వేసింది అంటుంది. ఈ విషయాన్ని ఎక్కడ తేల్చుకోవాలో అక్కడే తేల్చుకోవాలి కార్ తీయమంటుంది ధాన్యలక్ష్మి.
ఇదీ చదవండి: వివాహా జీవితంలో అడుగుపెట్టబోతున్న కిరణ్ అబ్బవరం.. హీరోయిన్ రహస్యతో ఈ వారంలో ఎంగేజ్‌మెంట్..
ఇంట్లో అమ్మమ్మ భాస్కర్లు ఆలోచిస్తుండగా వంటగదిలో ఉన్న కావ్యకు వద్దకు వచ్చిన రాజ్ నీకు గుడ్ న్యూస్ మీ బావకు గుడ్ న్యూస్ అంటాడు. ఇది పక్కనుంచి అమ్మమ్మ భాస్కర్లు కూడా వింటుంటారు. ఈ కవర్ చూశావా? నాకు నచ్చేది ఇందులో ఉంది నువ్వే చూడు అని ఇస్తాడు. కవర్ ఓపెన్ చేసిన కావ్యకు అందులో పాస్‌పోర్ట్ కనిపిస్తుంది. హమ్మయ్యా అనుకుంటూ పాస్‌పోర్టా? అంటుంది కావ్య. ఎస్ నీ బావతో అమెరికాలో సెట్టిల్ అవ్వడానికి లైన్ క్లీయర్ అయింది. నేను ఇక్కడ హ్యాపీగా సోలో లైఫ్ సో బెట్టర్ అనుకుంటూ ఉల్లాసంగా , ఉత్సాహంగా బతికేస్తా అంటాడు. దీంతో ఏం చేసేదిలేక బిత్తరపోతుంది కావ్య అదేంటి నువ్వు కోరుకున్నదే జరిగింది కదా అని వెళ్లిపోతాడు రాజ్. అప్పుడు అమ్మమ్మ కావ్య వద్ద కు వస్తుంది. చూశారా? అమ్మమ్మ నాకు పాస్‌పోర్ట్ ఇచ్చి వెళ్లిపోమంటున్నారు..ఆయనకు నామీద ప్రేమ లేదు అంటుంది. దీనికి అమ్మమ్మ లాభం లేదు చివరి అస్త్రం వదలాల్సిందే అంటుంది. ఏంటది అంటుంది కావ్య దానికి అమ్మమ్మ విడాకులు అంటుంది. మీ చేత్తో మీరే ఇస్తున్నారా? కలపడానికి విడిపోయే పత్రాలు ఎందుకు అంటుంది కావ్య. కలపడానికే ఇది మన ఆఖరి అస్త్రం సదుద్దేశంతోనే చేసేది అని అమ్మమ్మక కావ్య చేతిలో విడాకులపత్రాలను పెట్టేస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook