Brahmamudi Today: గేర్ మార్చిన రాజ్.. కావ్యకు అమెరికా పాస్ట్‌పోర్ట్‌.. అనామికను కాదని అప్పుతో కలిసిపోయిన కల్యాణ్..

Brahmamudi March 11th Episode: ఈరోజు ఎపిసోడ్‌లో రాజ్ తన అంతరాత్మతో మాట్లాడుతుంటాడు. కళావతి పై ఉన్న ప్రేమను చెప్పమని అంటాడు అంతరాత్మ. నేనేంటి కళావతిని ప్రేమించడం ఏంటి? పిచ్చా.. నాన్సెన్స్ అలా జరగదు అంటాడు.

Written by - Renuka Godugu | Last Updated : Mar 11, 2024, 08:53 AM IST
Brahmamudi Today: గేర్ మార్చిన రాజ్.. కావ్యకు అమెరికా పాస్ట్‌పోర్ట్‌.. అనామికను కాదని అప్పుతో కలిసిపోయిన కల్యాణ్..

Brahmamudi March 11th Episode: ఈరోజు ఎపిసోడ్‌లో రాజ్ తన అంతరాత్మతో మాట్లాడుతుంటాడు. కళావతి పై ఉన్న ప్రేమను చెప్పమని అంటాడు అంతరాత్మ. నేనేంటి కళావతిని ప్రేమించడం ఏంటి? పిచ్చా.. నాన్సెన్స్ అలా జరగదు అంటాడు. నాగాని మండిందంటే నిన్న వదిలిపెట్టి బావగాడి మనసులో దూరిపోతాను అంటాడు. నువ్వు చెప్పవ్, చెప్తే వినవ్ అంతరాత్మ మాటవినవు అని అంటాడు మిస్టర్ అంతరాత్మ. కళావతి మీద మిల్లిగ్రామ్ ప్రేమ కూడాలేదు ఏదో గాలి కోసం ఇక్కడ నిలబడ్డ. వాళ్లు ఏం చేసినా ఎక్కడికి వెళ్లినా నేను పట్టించుకోను. హే.. రా లోపలికి అనగానే అంతరాత్మ లోపలికి వెళ్లిపోతుంది.

అప్పడు బెడ్రూమ్లోకి వెళ్లినా ఒకే రక్తం పంచుకొని పుట్టకపోయినా నా రక్తం ఎరుపు నీరక్తం ఎరుపు అంటూ ఎవేవో మాట్లాడతాడు. అమెరికా నుంచి వచ్చిన తమ్ముడన్నయ్యను మీ పుట్టింట్లో వదిలేసి వచ్చా. దీంతో కావ్య భాస్కర్లు బిత్తరపోయి చూస్తారు. నాదసలే బ్రాడ్ మైండ్ అంటాడు. రాజ్ మీరు సినిమాకు వెళ్తారా? షికారుకు వెళ్తారా? పబ్‌కు వెళ్తారా? నేను టిక్కెట్‌ బుక్ చేస్తాను అంటాడు. అప్పుడు ఇవాలా బావ కంపెనీ బ్రాంచ్ లో ఏదో మీటింగ్ ఉందా ఓ సూట్ కావాలట. మీ దగ్గర చాలాఉన్నాయి కదా ఒకటి ఇస్తారని అంటుంది. అంతేనా అని కబోర్డ్‌ తెరిచి ఏ సూట్ కావాలి? ఏ కలర్ కావాలి అన్ని సూట్లను తీసి మంచంపై వేస్తాడు రాజ్.  అందుంలోంచి ఓసూట్ తీసుకుని థ్యాంక్స్ అన్నయ్య అంటాడు. ఈ అన్నయ్య ఈమాత్రం చేయలేనా? అంటాడు. తమ్ముడన్నయ్య నీ భుజ్జీని కూడా నీతోపాటు తీసుకెళ్లు. కార్ కూడా తీసుకో అని కీ ఇస్తాడు. కళావతిని కూడా తీసుకెళ్లు, మోసుకెళ్లు అని వాళ్లని పంపంచేస్తాడు రాజ్. ఆ తర్వాత అంతరాత్మను బయటకు రమ్మని చూశావా? వారిద్దరిని చూసి నేను కుళ్లుకోలేదు అని అంటాడు. నువ్వు ఇలాగే వదిలేస్తే వాళ్లు ఇద్దరూ రెచ్చిపోతారు. నువ్వు కుళ్లుకొని చచ్చిపోతావు అని అంతరాత్మ మాయమవుతుంది.

మరోవైపు అనామిక మమ్మి చెప్పినట్లు కళ్యాణ్ ను మచ్చిక చేసుకోవాలని అనుకుంటుంది. అప్పడే కల్యాణ్ అప్పుకు ఫోన్ చేస్తుంటాడు. అప్పు ఒకసారి కలుద్దాం అంటాడు. అది వెనకనుంచి అనామిక విని కోపంగా చూస్తుంటుంది. ఇప్పుడు ఎందుకు అంటుంది అప్పు నాకు కష్టం ఉంది ఇప్పుడు కలవ్వా? నాకు నీవు తప్ప ఎవరు ఉన్నారు చెప్పు. నువ్వు ఏం మాట్లాడకు మనం కలుస్తున్నాం అంతే అని ఫోన్ కట్ చేస్తాడు. వెనక్కి తిరగ్గానే అనామిక ఉంటుంది. దాన్ని కలవాల్సిన అవసరం ఏముంది అంటుంది అనామిక పెళ్లాం ఉన్నా మరో అమ్మాయిని కలిస్తే నా పరువు పోతుంది అనామిక అంటుంది. దీనికి కల్యాణ్ మా మనస్సులో ఎటువంటి చెడు ఉద్దేశ్యాలు లేవు అంటాడు. అటు అప్పు కూడా నా ఫ్రెండ్ కష్టం ఉంటే నేను సహాయం చేయాలి కలుస్తాను అంటూ కనకానికి కూడా చెబుతుంది. దీంతో మళ్లీ గొడవలు వస్తే ఎలా అని కంగారు పడుతుంది. నా కూతురు ఎటువంటి తప్పు చేయదు ఎలా నిలదీయను అని అంటాడు కావ్య నాన్న.

ఇదేం ట్విస్ట్‌ బుజ్జీ అని కావ్య భాస్కర్లు రాజ్ గురించి మాట్లాడుకుంటారు. అప్పుడే ఇందిరా దేవి మీరు సాధించుకొచ్చారా? అని అడుగుతుంది. వాడు వట్టి పిచ్చి మారాజు వాడికి లోపల ఎంత ప్రేమ ఉంటుందో తెలుసా? అంటుంది. అమ్మమ్మగారు మీరు మీ మనవడి దగ్గర చాలా ఎక్స్‌ పెక్ట్ చేస్తున్నారు కానీ, అక్కడ అంత సీన్ లేదు అంటుంది కావ్య. అదేంటి.. అని ఆలోచిస్తూ అర్థమైంది వాడు రివర్స్ లో వస్తున్నాడు ఎలా వచ్చినా వాడి బండికి స్పీడ్ బ్రేకర్స్ నేను వేస్తాను అని వెళ్లిపోతుంది ఇందిరాదేవి. 

ఇదీ చదవండి:  ఘనంగా ఆస్కార్ 96వ అవార్డు వేడుక, అవార్డులు కొల్లగొడుతున్న ఓపెన్ హైమర్

ఇక అనామిక బాల్కనీలో నిలబడి ఏడుస్తూ ఉంటుంది. ధాన్యలక్ష్మి గమనించి ఏం జరిగింది అని అడుగుంది. స్వప్న ఎలా మాట్లాడిందో చూశారా ఆస్తి రాసిచ్చేసారు. మనం రోడ్డు పాలు అవ్వడం ఖాయం. ఒకవైపు స్వప్న కావ్యలు టార్చర్‌ చేస్తూంటే మీ అబ్బాయి కూడా టార్చర్ చేస్తున్నాడు. బయట తిరుగుతున్నాడు అంటుంది. అబ్బాయితో నువ్వు ప్రేమగా ఉండాలి అంటుంది. మీ మధ్య ఎన్ని గొడవలు ఉన్నా నాలుగు గోడల మధ్యే ఉండాలి అంటుంది ధాన్యలక్ష్మి. అనామిక మాత్రం కల్యాణ్ తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నాడు అప్పుతో మాట్లాడుతున్నాడు అంటుంది. దానికి ధాన్యలక్ష్మి వాడు నా మాట కాదని ఆ పనిచేయడు అంటుంది. అయ్యో.. ఆంటీ అప్పుతో మాట్లాడటం నేను చూశాను అంటుంది అనామిక. మీ అబ్బాయి అలా చేస్తుంటే నా మనస్సు ఎంత బాధపడుతుంది. మా మమ్మి ఫోన్ చేసి నా కాపురం ఎలా ఉంది అని అడుగుతుంది. ఏం చెప్పాలి అంటుంది. నువ్వు ఫ్రెషప్ అయి రా షాపింగ్ వెళ్దాం చిన్న పని ఉంది అంటుంది. 

ఇదీ చదవండి:  గ్లామర్ తో గరం గరం చేస్తున్న సచిన్ కూతురు.. మరి ఈ రేంజ్ లోనా..

మరోవైపు మనం పావళా యాక్టింగ్ చేస్తే ఆయన రూపాయి పవలా యాక్టింగ్ చేస్తున్నాడు అంటుంది కావ్య. మనం విడిపోయాక నువ్వు సంతోషంగా మీ బావతో కలిసి సంతోషంగా అమెరికాలో సెట్టిల్ అయిపో అని పాస్‌పోర్ట్‌ తెచ్చి కావ్యకు ఇస్తాడు. దీంతో లాభం లేదు చివరి అస్త్రం సంధించాల్సిందే అంటుంది ఇందిరా దేవి. ఏం జరుగుతుంతో చూడాలి ఇక..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News