Brahmamudi Today December 31 Episode:  కాఫీ తాగుతూ పైన బాల్కానీలోకి వస్తుంది రుద్రాణీ.. అప్పుడే కింద కావ్య కార్లను తీసుకెళ్లమని చెబుతుంది. అంతేకదండీ, ప్రాబ్లెమ్ సాల్వ్ అంటుంది. ఆ విషయం ఇంట్లో చెప్పావా? అంటాడు. చెబితే గొడవ అవుతుంది పదండి ఆఫీస్‌ వెళ్దాం అంటుంది. ఎస్‌ ఇది కదా.. గుడ్‌ న్యూస్‌ అంటే అంటుంది రుద్రాణీ. ఇన్నాళ్లు ఇంట్లోవారంతా కావ్య వెర్రెక్కి చేస్తున్న పనులను వెనకేసుకువచ్చారు కదా. కార్ల గురించి చెప్పి అధికారం చెలాయించడానికి కాదు, అడుక్కుతినడానికి కూడా పనికి రాదు అని ప్రూవ్‌ చేయాలి అని మాట్లాడుకుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆఫీసులో రాజ్‌కు మళ్లీ తలనొప్పి మొదలవుతుంది. జగదీష్‌ గారి కాంట్రాక్ట్‌ పూర్తి చేయాలంటే రూ.5 కోట్లు కావాలి అంటాడు. అప్పుడే ఆయన రాజ్‌.. అని వస్తాడు. మీ పని మీదే ఉన్నాం సార్‌. ఇంకా మీరు అడిగిన టైమ్ పీరియడ్‌ అవ్వలేదు అంటాడు. నేను కావ్య ఫోన్‌ చేస్తే వచ్చా అడ్వాన్స్‌ అడిగింది అంటాడు. రూ.5 కోట్లు ఇస్తున్నా కూర్చొని కూడా తీసుకోవచ్చు అని రాజ్‌ చేతిలో పెడతాడు. ఏమాత్రం కష్టపడకుండా రూ.5 కోట్లు ఇస్తే ఈయనేంటి ఇలా చూస్తాడు అంటుంది కావ్య. జగదీష్‌ను పంపించేస్తాడు. కావ్యను ఎత్తుకుని తిప్పుతాడు రాజ్‌, అప్పుడే శృతి మేడం అని వస్తుంది. ఢమాల్‌మని కావ్యను పడేస్తాడు. డోర్‌ కొట్టి రావాలి కదా అంటాడు. ఇంకోసారి ఇలా రాకు అంటాడు. నీకు ఇంక్రిమెంట్‌ కట్‌ అంటాడు. సార్‌, ఎత్తుకున్న మీరు బాగున్నారు, కింద పడ్డ మేడం బాగున్నారు. మధ్యలో నా ఇంక్రిమెంట్‌ కట్ అంటారు.


మరోవైపు ఇంట్లో రుద్రాణీ అన్నయ్య.. ఏంటి ఎక్కడకు వెళ్తున్నావ్‌ అంటుంది. క్లబ్‌కు వెళ్తున్న అంటాడు. ఏదైనా సమస్యఉంటే రాహుల్‌ను కూడా తీసుకెళ్లు అంటుంది. సుభాష్‌ వద్దని వెళ్లిపోతాడు. రేయ్‌ ఇంట్లో ఉండే రెండు కార్లలో ఒకటి రాజ్‌ తీసుకెళ్లాడు, ఇంకోటి మా అన్నయ్య తీసుకెళ్లాడు. దీంతో ఇంట్లో చిన్న సైజ్‌ సునామీ సృష్టిస్తా చూడు అని ధాన్యలక్ష్మి దగ్గరకు వెళ్తుంది రుద్రాణీ. నా నగలు మెరుగుపట్టించి చాలా రోజులు అయింది. నువ్వు నాతో రావచ్చు కదా అంటుంది. నాకు పని ఉంది అంటుంది ధాన్యం.  అంతేలే నీకు నీ కొడుక్కి ఈ ఆస్తిలో వాటా రావాలని నేను నిలబడ్డ.. నీ కోసం ఇంత చేస్తుంటే జస్ట్ బయటకు రాలేను అంటున్నావ్‌. అబ్బ.. ఈమాత్రం దానికే అంత పెద్దలు మాట్లాడాలా అంటుంది రుద్రాణీ.


బయటకు వస్తారు ఏంటి? ఒక్క కారు కూడా లేదు అంటుంది ధాన్యం.. అవును కదా ఇంట్లో నాలుగు కార్లు ఉండాలి కదా... అప్పుడే రాహుల్‌ వచ్చి మామ్‌.. ఇప్పుడే డ్రైవర్లు నాలుగు కార్లు తీసుకెళ్లడం చూశా అంటాడు, సర్వీసింగ్‌ అయితే, నాలుగు ఒక్కసారే ఎందుకు తీసుకెళ్తారు అంటాడు. ఇక డ్రైవర్‌కు ఫోన్‌ చేస్తుంది ధాన్యం. ఎక్కడ చచ్చావురా? అంటుంది. మర్యాదలేదా ఏమాట్లాడుతున్నావమ్మ.. కావ్య మేడం రెండు కార్లు చాలని నాలుగు కార్లు అవసరం లేదని చెప్పింది అందుకే తీసుకెళ్లాం అంటాడు డ్రైవర్‌.


ఇదీ చదవండి:  నాన్నకు తెలియకుండా టెంపుల్స్‌కు వెళ్లేదాన్ని.. షాకింగ్‌ నిజాలు బయటపెట్టిన శృతిహాసన్‌..!  
దాన్ని మేడం అంటున్నాడు, మనల్ని ఛీ, తూ అంటున్నాడు. వైభోగం చూసిన మనకు డ్రైవర్‌ స్థాయిలో ఉన్నవారు కూడా రెస్పెక్ట్‌ ఇవ్వని స్థితికి తెచ్చింది చూడు. ఇంట్లోకి వెళ్తుంది ధాన్యం. అక్క.. అక్క.. అని అరుస్తుంది. అపర్ణ ఏమైంది ధాన్యలక్ష్మి అంటుంది. నీ కోడలు గొప్పది అని చెబుతావు కదా.. ఇంకా మనల్ని కింద స్థాయికి తీసుకెళ్తుంది. మనల్ని కూడా మట్టిపిసుక్కునేలా చేస్తుందా? అంటుంది. ధాన్యం ఏం జరిగింది? ఈ ఇంట్లో కావ్య రాజ్‌ తప్ప మనం మనుషులం కాదా? ఒక్క కార్‌ ఆవిడ వేసుకెళ్లింది. ఒక్కటి బావగారు తీసుకెళ్లారు అందరినీ తీసుకెళ్లి బజారున నిలబెడుతుందా? అని నిలదీస్తుంది. 


కావ్య ఉద్దేశం ఏంటో కనుకుంటా..ఇన్ని రోజులు తిననివ్వలేదు, క్రెడిట్‌ కార్డులు బ్లాక్‌ చేయించింది. ఇప్పుడు కార్లు కూడా లేకుండా చేసింది. నా కొడలు మీద సాధించడానికి నీకు బాగా సాకు దొరికింది అంటుంది అపర్ణ. ఫోన్‌ చేస్తాను ఆగు అంటుంది. కావ్యతో ముఖ్యమైన విషయం మాట్లాడతా అంటుంది. బిజీ ఉన్న మళ్లీ మాట్లాడతా అత్తయ్య ప్లీజ్‌ అంటుంది కావ్య. ఒకే ముందు వర్క్ ముఖ్యం అంటుంది అపర్ణ. వామ్మో అత్తగారు ఫోన్‌ చేస్తే కూడా మేడం గారు అంత బిజీ ఉందా? ఎవరినీ ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచకుండా ఆస్తి పంచితే ఇలానే ఉంటుంది. ఇక ఎగదోసింది చాలు, నా కోడలు వెళ్లింది సాయంత్రం వస్తుంది అంటాడు. 


ఇదీ చదవండి:  న్యూ ఇయర్ బంపర్‌ గిఫ్ట్‌ జనవరి 1న హాలిడే..  స్కూల్లు, ఆఫీసులకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..!    


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.