New Year Public Holiday 2025: తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చేసింది. న్యూ ఇయర్ గిఫ్ట్ గా జనవరి ఒకటి పబ్లిక్ హాలిడే గా ప్రకటించింది. దీంతో అన్ని స్కూల్లు, కాలేజీలు, ఆఫీసులకు ఈరోజు సెలవు రానుంది. దీంతో ప్రారంభంలోనే విద్యార్థులకు మరో సెలవు కూడా వచ్చేసింది. న్యూ ఇయర్ గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేసుకునే అవకాశం దొరికింది..
ఈరోజు డిసెంబర్ 31 పాత ఏడాదికి టాటా చెబుతూ.. కొత్త ఏడాదికి ఆనందకేలితో స్వాగతం పలుకుతారు. 2025 ఆనందంగా స్వాగతం పలకడానికి ఈరోజు రాత్రి 12 గంటలకు వరకు సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఆ తర్వాత కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ యువత సెలబ్రేషన్స్ చేసుకుంటారు.
అందరికీ కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలుపుతూ ఎంజాయ్ చేస్తారు. న్యూ ఇయర్ అంటేనే అదో కొత్త వైబ్, అందరికీ ఇష్టం. ఇక అందులో హాలిడే అంటే ఎగిరి గంతేస్తారు. తమ స్నేహితులు, బంధువులను కలుస్తారు. అందుకే తెలంగాణ వ్యాప్తంగా రేపు జనవరి 1వ తేదీనా పబ్లిక్ హాలిడే గా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం.
దీంతో స్కూల్లు, కాలేజీలు,ఆఫీసులకు కూడా సెలవు ఉంది. ఆంధ్రప్రదేశ్ సర్కార్ మాత్రం రేపు అక్కడ సెలవు ప్రకటించలేదు. దీంతో విద్యాసంస్థలు, కార్యాలయాలు యథావిధిగా పని చేయనున్నాయి.
హైదరాబాద్ వ్యాప్తంగా ఇప్పటికే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. డిసెంబర్ 31 ప్రతి ఏడాది గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకుంటారు. పార్టీలు, ఈవెంట్లు నిర్వహిస్తూ రెస్టారెంట్లు కళకళలాడుతుంటాయి. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో కొన్ని ఆంక్షలు కూడా పోలీసులు విధించారు.
ఏవైనా ఈవెంట్స్ నిర్వహిస్తే ముందుగానే పర్మిషన్ తీసుకోవాలి. బహిరంగ ప్రదేశంలో అసభ్యకర డాన్సులు వేయకూడదు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవారికి భారీగా ఫైన్ వేయడానికి రెడీ అవుతుంది. తెలంగాణ సర్కార్ ఇప్పటికే మందు బాబులకు గుడ్ న్యూస్ చెప్పింది.
డిసెంబర్ 31 రాత్రి 12 గంటల వరకు మద్యం షాపులు ఓపెన్ ఉండనున్నాయి. రెస్టారెంట్లు, పబ్బులు, బార్లు వంటివి రాత్రి ఒకటి వరకు ఓపెన్ ఉంటాయి. ఇది మందు బాబులకు పండగ లాంటి వార్త.
ప్రతి ఏడాది జనవరి ఒకటో తేదీన అందరూ ఉదయం లేచి గుడిలకు వెళ్లే సాంప్రదాయం ఉంది ఇష్ట దైవాన్ని దర్శించుకుంటారు. ఈరోజు నుంచి కొత్త ఏడాది జీవితం ఆనందంగా సమస్యలు లేకుండా సాగిపోవాలని కోరుకుంటారు. అంతేకాదు ఈ ఏడాది అయినా తాము కోరుకున్న కోరికలు నేరవేరాలను ప్రార్థిస్తారు.