Dil Raju Hot Comments: తెలుగు సినీ పరిశ్రమపై రేవంత్‌ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని.. ఆ క్రమంలో సినీ ప్రముఖులతో బలవంతంగా సమావేశం నిర్వహించారని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌పై దిల్‌ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ వ్యాఖ్యలను తప్పుబట్టారు. దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KT Rama Rao: మన్మోహన్‌ సింగ్‌ను అవమానించిన రాహుల్‌ గాంధీ.. ఇది తగునా అంటూ కేటీఆర్‌ ఆగ్రహం


'రేవంత్ రెడ్డితో జరిగిన తెలుగు చిత్ర పరిశ్రమ సమావేశంపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం' అని తెలంగాణా ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌ దిల్‌ రాజు తెలిపారు. 'సీఎంతో జరిగిన సమావేశం ఒకరిద్దరితో చాటుమాటున జరిగిన వ్యవహారం కాదని అందరికీ తెల్సిందే. తెలుగు చిత్ర పరిశ్రమ బాగోగుల గురించి అత్యంత స్నేహపూర్వకంగా.. ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగిన ఈ సమావేశం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ చాలా సంతృప్తిగా ఉంది' అని దిల్‌ రాజు తెలిపారు.

Also Read: Harish Rao: ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితిలో రేవంత్‌ రెడ్డి: హరీశ్ రావు ఆగ్రహం


'తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పయనంలో తెలుగు చిత్ర పరిశ్రమ భాగస్వామ్యాన్ని గుర్తించి.. రాష్ట్రాభివృద్ధికి, సామజిక సంక్షేమానికి.. మా బాధ్యతగా తగిన సహకారం అందజేయాలని సీఎం కాంక్షించారు' అని దిల్‌ రాజు చెప్పారు. 'హైదరాబాద్‌ ప్రపంచ వినోద కేంద్రంగా తీర్చదిద్దాలనే సంకల్పాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతినిధులుగా మేమందరం స్వాగతించాం' అని వివరణ ఇచ్చారు. 'అనవసర వివాదాల్లోకి తెలుగు చిత్ర పరిశ్రమను లాగి.. పరిశ్రమకు లేనిపోని రాజకీయాలను ఆపాదించొద్దని మా మనవి' అంటూ కేటీఆర్‌పై పరోక్షంగా దిల్‌ రాజు వ్యాఖ్యలు చేశారు.


'రాజకీయ దాడి.. ప్రతిదాడులకు దయచేసి పరిశ్రమను వాడుకోవద్దని అందరిని కోరుతున్నాం. లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమకు అన్ని ప్రభుత్వాల సహకారం, ప్రజలందరి ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నాం' అని దిల్‌ రాజు ప్రకటించారు. అయితే దిల్‌ రాజు చేసిన ప్రకటన తెలంగాణా ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తరఫున మాత్రమే అని.. ఆయన వ్యక్తిగతంగా కేటీఆర్‌పై వ్యాఖ్యలు చేయలేదని స్పష్టమవుతోంది. రేవంత్‌ రెడ్డి దగ్గరుండి ఈ ప్రకటన చేయించాడని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఏది ఏమైనా కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook