Indian 2 Mishap: దర్శకుడు శంకర్‌పై 2గంటలపాటు సీబీఐ ప్రశ్నల వర్షం
ఇండియన్ 2 సినిమా షూటింగ్ సెట్స్‌లో జరిగిన ప్రమాదంపై నమోదైన కేసు విచారణకు దర్శకుడు శంకర్ హాజరయ్యారు. దాదాపు రెండు గంటలకు పైగా సీబీఐ అధికారులు శంకర్‌ను ప్రశ్నించినట్లు సమాచారం.
చెన్నై: నటుడు కమల్ హాసన్ కథానాయకుడిగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తోన్న భారతీయుడు 2 సినిమా షూటింగ్ సెట్‌లో ఇటీవల జరిగిన ప్రమాదం జరిగి ముగ్గురు చనిపోయారు. దీనిపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో దర్శకుడు శంకర్ విచారణకు పోలీసుల ఎదుట హాజరయ్యారు. పోలీసులు సమన్లు జారీ చేయడంతో చెన్నైలోని పోలీస్ కమిషనర్ కార్యాలయానికి శంకర్ గురువారం హాజరై ఘటన వివరాలను తెలియజేశారు. అసలేం జరిగింది, తదనానంతర జరిగిన పనులపై పోలీసులు దర్శకుడిని ఆరా తీసినట్లు సమాచారం. క్రేన్ తనమీద పడినా బాగుండేదని శంకర్ చేసిన ట్వీట్ సంచలనంగా మారడం తెలిసిందే.
Also Read: భారతీయుడు 2 షూటింగ్‌లో ప్రమాదం.. క్రేన్ కూలి ముగ్గురి దుర్మరణం
సెంట్రల్ క్రైం బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్ నాగజ్యోతి ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. సీబీఐ అధికారులు శంకర్‌ను రెండు గంటలకు పైగా విచారించారు. కాగా, క్రేన్ విరిగిపడ్డ ఘటనపై నజరత్ పేట పోలీసులు ఇదివరకే లైకా సంస్థతో పాటు క్రేన్ ఆపరేటర్, కాంట్రాక్లర్, ఇండియన్ 2 సినిమా ప్రొడక్షన్ యూనిట్‌పై కేసు నమోదు చేశారు. హీరో కమల్ హాసన్‌ను వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా పోలీసులు సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన క్రేన్ ఆపరేటర్‌ను పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేసి విచారించారు.
Also Read: తల్లా.. పెళ్లామా.. తేల్చుకోండి: అనసూయ
Also Read: ముగ్గురు సహోద్యోగుల్ని కోల్పోయా: కమల్ హాసన్ భావోద్వేగం
కాగా, చెన్నై శివారులోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో ఫిబ్రవరి 19న (బుధవారం) భారతీయుడు 2 సినిమా షూటింగ్ జరుగుతుండగా.. సెట్‌లో ఏర్పాటు చేసిన 150 అడుగుల భారీ క్రేన్ తెగిపడింది. ఈ ప్రమాదంలో అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ (34), ఆర్ట్ అసిస్టెంట్ చంద్రన్, డైరెక్టర్ శంకర్ పర్సనల్ అసిస్టెంట్ మధు (29) చనిపోయారు. దాదాపు మరికొందరు మూవీ యూనిట్ సభ్యులు గాయపడ్డారు. చనిపోయిన వారికి హీరో కమల్ హాసన్ కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు.
AlSo Read: టాలీవుడ్‌కు మోడల్ 'రొమాంటిక్' ఎంట్రీ!.. ఫొటోలు
Also Read: తనకంటే 37 ఏళ్లు పెద్ద వ్యక్తితో నటి రిలేషన్