Ram Gopal Varma biopic movies: ఎప్పుడూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal varma) లాక్‌డౌన్, కరోనా (Coronavirus) వ్యాప్తి సమయంలోనూ తనదైన శైలిలో సినిమాలను తీసి విమర్శలను, ప్రశంసలను పొందిన విషయం తెలిసిందే. ఎవరు ఎమనుకున్నా.. డోంట్ కేర్ అంటూ వర్మ సోషల్ మీడియా వేదికగా తనదైన స్టైల్లో స్పందిస్తుంటారు. అయితే అసలు రామ్ గోపాల్ వర్మ చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవారు.. ఆయన పెద్దయ్యాక ఎమవుదామనుకుని.. సినిమాల్లోకి అడుగుపెట్టారు.. ఏదిఏమైనా.. ఖరాఖండిగా ఉన్నది ఉన్నట్టు చెప్పాలని ఆయనకు ఎప్పుడనిపించింది.. ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా..?  అయితే మూడు పార్ట్‌లుగా వస్తున్న ఆయన బయోపిక్ మూవీలు చూడాల్సిందే. అయితే.. ఆ బయోపిక్‌లో డైరెక్టరే హీరోగా నటిస్తున్నారు. ఈ మేరకు స్వయంగా వర్మ తన క్యారెక్టర్‌ను ఇతనే చేస్తున్నాడంటూ.. ట్విట్టర్‌లో పంచుకున్నారు. Also read: Babri Masjid demolition case: 30న బాబ్రీ కేసు తీర్పు



ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మపై మూడు సినిమాలకు దొర‌సాయి తేజ ( Dora Sai Teja) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అయితే ఫ‌స్ట్ పార్టులో ఆర్జీవీ 20 ఏళ్ల వ‌య‌స్సులో కాలేజీ రోజుల్లో ఎలా ఉండేవారో అనేదానిని దొరసాయి తేజ చూపించనున్నారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఎమిటంటే.. ఈ పాత్ర‌ను డైరెక్ట‌ర్ దొర‌సాయి తేజ‌నే పోషిస్తుండ‌టం విశేషం. ఈ సినిమా షూటింగ్ ఈ నెల నుంచే ప్రారంభం కానుంది. ఈ మేరకు రామ్ గోపాల్ వర్మ ఈ విధంగా ట్విట్ చేశారు. దొరసాయి తేజ.. నా బ‌యోపిక్ రాము చిత్రం తొలి పార్టులో నటిస్తున్నాడు.. దీనికోసం అతను మా అమ్మ ఆశీస్సులు తీసుకుంటున్నాడ‌ంటూ వ‌ర్మ ఫొటోను షేర్ చేశారు. దీంతో ఈ ఫొటో కాస్త ఇప్పుడు సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంపై వైరల్ అయింది. ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే.. రామ్ గోపాల్ వర్మనే మూడో పార్ట్‌లో కనిపిస్తారని సమాచారం. ఈ క్రమంలో ఆర్జీవీ జీవితంలోని ప‌లు కోణాలను మూడు సినిమాల్లో డైరెక్టర్ దొరసాయి తేజ ఎలా.. ఏ విధంగా తెరకెక్కించనున్నారు..  అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.   Also read: Sputnik-V vaccine : ఆర్‌డీఐఎఫ్‌తో డా. రెడ్డీస్ ఒప్పందం.. భారత్‌లో ‘స్పూత్నిక్ వీ’ ట్రయల్స్