బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ సందీప్ సింగ్ మరోసారి వార్తల్లోకెక్కారు. ప్రముఖ టీవీ ఛానల్‌పై రూ.200 కోట్ల మేర పరువు నష్టం దావా (Sandeep Singh Defamation Case) దాఖలు చేశారు. తన స్నేహితుడు, నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో తన పేరును మీడియా సంస్థ ప్రస్తావించడాన్ని సందీప్ సింగ్ (Sandeep Singh) తప్పుపట్టారు. తన పేరు, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా... నిరాధార కథనాలను ప్రచారం చేశారని ఆరోపించారు. రిపబ్లిక్ టీవీతో పాటు మరికొన్ని ఛానల్స్, పేపర్ మీడియాకు తన తరఫు లాయర్ నుంచి పరువు నష్టం దావాకు సంబంధించిన నోటీసులు సందీప్ సింగ్ పంపించారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


అసలే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకేసు పాట్నా నుంచి సీబీఐ విచారణకు వెళ్లడం ఆపై బాలీవుడ్ ఇండస్ట్రీనే చిక్కుల్లో పడేసేలా డ్రగ్స్ కేసు బయటకు వచ్చింది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని నార్కోటిక్ విభాగం విచారిస్తోంది. అయితే తన స్నేహితుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో కొన్ని విషయాలను ఛానల్‌లో ప్రసారం చేశారని, అందుకు సంబంధించిన ఫుటేజీని మొత్తం తొలగించాలని నిర్మాత సందీప్ సింగ్ డిమాండ్ చేశారు. అంతటితో ఆగకుండా రిపబ్లిక్ టీవీకి, చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామికి బుధవారం నాడు నోటీసులు పంపించారు.



 


 



 


నేర పూరిత ఆరోపణలు చేస్తూ తన క్లయింట్ సందీప్ సింగ్‌పై నిరాధార కథనాలు ప్రచారం చేశారని, అందుకుగానూ క్షమాపణలు కోరాలని ఆయన తరఫు లాయర్ నోటీసులలో పేర్కొన్నారు. తక్షణమే సందీప్ సింగ్‌కు క్షమాపణ చెబుతూ లేఖగానీ, వీడియో సందేశం గానీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దాంతోపాటుగా నిజనిజాలు సైతం వెల్లడించాలని  కోరారు.  



కాగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ సినిమాకు సందీప్ సింగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. మేరీ కోమ్, అలీగఢ్, సరబ్‌జీత్, భూమి లాంటి పలు సినిమాలను నిర్మించారు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe