God father vs Lucifer: మోహన్ లాల్ లా ఎత్తలేకపోయిన మెగాస్టార్.. ఈ రచ్చ ఏందయ్యా?
God father vs Lucifer trolls started in social media: గాడ్ ఫాదర్ సినిమాను లూసిఫర్ సినిమాతో పోలుస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
God father vs Lucifer trolls started in social media: మెగాస్టార్ హీరోగా గాడ్ ఫాదర్ అనే సినిమా దసరాకు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమాకు ఇది తెలుగు రీమేక్. వాస్తవానికి మలయాళం సినిమానే అయినా ఈ సినిమాని తెలుగులో డబ్బింగ్ చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేశారు. అప్పట్లోనే తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా చూసి బాగుందని మెచ్చుకున్నారు.
మరి ఎందుకు రీమేక్ చేయాలనిపించిందో ఏమో తెలియదు కానీ కొణిదెల ప్రొడక్షన్ సంస్థ రంగంలోకి దిగి తెలుగు రీమేక్ హక్కులు కొనుక్కుని సినిమా ప్రకటించి పూర్తిచేసి దసరాకి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ ఈ సినిమా తెలుగులో కూడా అందుబాటులో ఉండడంతో దాదాపు చాలామంది ఇప్పటికే సినిమా వీక్షించారు. అయితే ఇప్పుడు కచ్చితంగా మోహన్ లాల్ నటనకు చిరంజీవి నటనకు కంపారిజన్ మొదలవుతోంది.
ఇప్పటికే ఒక ట్రైలర్ వదిలారో లేదో అప్పుడే మోహన్ లాల్ ను చిరంజీవిని కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మొదలయ్యాయి. లూసిఫర్ సినిమాలో ఒక సీన్లో పోలీస్ ఆఫీసర్ ను గోడకు అదిమిపెట్టి కాలితో పీక నొక్కే సీన్ ఉంటుంది. చేతులు రెండింటికి సంకెళ్లు వేసి ఉండటంతో మోహన్ లాల్ ఆ సీన్లో అలా నటించాల్సి వస్తుంది. అదే సీన్ ను తెలుగులో మెగాస్టార్ చేత చేయించారు. కానీ మెగాస్టార్ పూర్తిగా కాలు ఎత్తలేని పరిస్థితుల్లో ఒక బల్ల వేసి బల్ల మీద సముద్రకనిని కూర్చోబెట్టి ఆయన పీక మీద కాలు పెట్టినట్టు చూపించారు.
ఇలా ఒక సీన్లో ఒక ఫ్రేమ్లో ఈ విధంగా కంపేరిజన్ చేస్తున్నారంటే కచ్చితంగా పూర్తి సినిమా విడుదలైన తర్వాత అసంఖ్యాక ట్రోల్స్ సినిమా మీద వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. దానికి తోడు మలయాళ మాతృకలో మంజు వారియర్ సోదరుడు పాత్రలో టోవినో థామస్ కనిపిస్తారు. అయితే తెలుగులో మాత్రం అలాంటి పాత్ర ఉన్న జాడే ట్రైలర్ లో కనిపించలేదు. గతంలో ఆ పాత్రను తప్పించి తెలుగు వెర్షన్ రూపొందిస్తున్నట్లు ప్రచారం జరిగింది. తాజా ట్రైలర్ ప్రకారం చూస్తే అది నిజమే అనుకోవాలి.
ఒక రకంగా సినిమాను మలుపు తిప్పే పాత్రని తప్పించి తెలుగులో ఎలా ప్లాన్ చేశారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ లాజిక్ తో కనుక తెలుగు ప్రేక్షకులను మెప్పించకపోతే ఆచార్య రిజల్ట్ మళ్ళీ పునరావృత్తం అవ్వక తప్పదని విశ్లేషణలు ఉన్నాయి. మరి చూడాలి ఈ సినిమా డైరెక్టర్ మోహన్ రాజా ఎలాంటి మ్యాజిక్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుబోతున్నారు అనేది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా భాగం కావడంతో సినిమాని హిందీలో రిలీజ్ చేస్తున్నారు. నయనతారకు ఉన్న మార్కెట్ దృష్ట్యా మలయాళంలో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయంలో కాస్త ట్రోల్స్ ఇప్పటికే మొదలయ్యాయి. అయితే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత సినిమా ఆకట్టుకుంటే ఈ ట్రోల్స్ కాస్త తగ్గే అవకాశం ఉంది.
Also Read: Chiranjeevi-Mahesh Babu: కృష్ణ, మహేశ్ బాబులను పరామర్శించిన చిరంజీవి!
Also Read: The Ghost Remuneration: రెమ్యునరేషన్ లేకుండానే సినిమా.. నమ్మాకంతో ఆ ఏరియాల రైట్స్ నాగ్ కైవసం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook