Nagarjuna Remuneration for The Ghost Movie Became hot topic: చివరిగా నాగార్జున హీరోగా ఆఫీసర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తరువాత నాగచైతన్య లీడ్ రోల్లో రూపొందిన బంగార్రాజు సినిమాలో కొన్ని సీన్లలో కనిపించారు కానీ అది పూర్తిస్థాయి నాగార్జున సినిమా అని చెప్పలేం. చాలాకాలం తర్వాత ఆయన ఇప్పుడు ది ఘోస్ట్ అనే ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.
గరుడవేగ, గుంటూరు టాకీస్ లాంటి సినిమాలు తెరకెక్కించి మంది దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో ఈ సినిమా రూపొందుతోంది. వరుస హిట్లతో ఊపు మీద ఉన్న ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్, పుష్కూర్ రామ్మోహన్రావుతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సోనాల్ చౌహాన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా కోసం నాగార్జున రెమ్యునరేషన్ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
సాధారణంగా మన తెలుగు హీరోలంటే భారీగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ ఉంటారు కానీ నాగర్జున ఈ సినిమా విషయంలో ఉన్న నమ్మకంతో అసలు రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమా పూర్తి చేశాడట. రెమ్యూనరేషన్ బదులుగా వైజాగ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు ఏరియాలకు చెందిన హక్కులు ఫ్రీగా తీసుకున్నాడట. అంతేకాక ఈ సినిమా మొత్తాన్ని తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్స్ తరఫున డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు.
ఈ సినిమా మీద ఉన్న నమ్మకంతోనే నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో నాగార్జున ఒక ఇంటర్పోల్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో పేరు తెచ్చుకున్న గుల్ పనాగ్ ఈ సినిమాలో నాగార్జున సోదరి పాత్రలో కనిపిస్తుండగా మేనకోడలు పాత్రలో అనికా సురేంద్రన్ కనిపించబోతోంది.
Also Read: SSMB28 Aarambham : షూట్ కూడా పూర్తి కాకుండానే షాకిస్తున్న మహేష్ మూవీ రైట్స్
Also Read: Chiranjeevi-Mahesh Babu: కృష్ణ, మహేశ్ బాబులను పరామర్శించిన చిరంజీవి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook