Chiranjeevi-Mahesh Babu: కృష్ణ, మహేశ్‌ బాబులను పరామర్శించిన చిరంజీవి!

Chiranjeevi meets Mahesh Babu over Indira Devi demise. కృష్ణ, మహేశ్‌ బాబులను నేడు మెగాస్టార్‌ చిరంజీవి పరామర్శించారు.  

Written by - P Sampath Kumar | Last Updated : Sep 29, 2022, 03:57 PM IST
  • మహేశ్‌ బాబును పరామర్శించిన చిరంజీవి
  • కృష్ణను పరామర్శించిన చిరంజీవి
  • తుదిశ్వాస విడిచిన ఇందిరా దేవి
Chiranjeevi-Mahesh Babu: కృష్ణ, మహేశ్‌ బాబులను పరామర్శించిన చిరంజీవి!

Chiranjeevi meets Krishna and Mahesh Babu over Indira Devi demise: సూపర్‌ స్టార్‌ కృష్ణ సతీమణి, మహేశ్‌ బాబు తల్లి ఇందిరా దేవి బుధవారం (సెప్టెంబర్ 28) తెల్లవారు జామున తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ఇందిరా దేవి మరణంతో ఘట్టమనేని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సినీ, రాజకీయ ప్రముఖులు నిన్న మహేశ్‌ బాబు ఇంటికి వెళ్లి.. ఇందిరా దేవి పార్థివదేహానికి నివాళులు అర్పించారు. 

కృష్ణ, మహేశ్‌ బాబులను నేడు మెగాస్టార్‌ చిరంజీవి పరామర్శించారు. గురువారం ఉదయం ఇంటికి వెళ్లి మహేశ్‌, కృష్ణలతో కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా కృష్ణ సతీమణి, మహేశ్‌ తల్లి ఇందిరా దేవి మరణం పట్ల చిరు విచారం వ్యక్తం చేశారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు చిరంజీవి సంతాపం తెలిపారు. ఇందుకు సంబందించిన ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. 

ఇక చిరంజీవి కథానాయకుడిగా మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘గాడ్‌ఫాదర్‌’. ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్‌, సల్మాన్‌ ఖాన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబర్ 5న రిలీజ్ కానుంది. గాడ్‌ ఫాదర్‌ ట్రెలర్‌ ఈవెంట్‌ బుధవారం అనంతపురంలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం నేపథ్యంలో మెగాస్టార్ అనంతపురంలో ఉన్నందున బుధవారం ఇందిరా దేవి అంత్యక్రియల్లో పాల్గొనలేకపోయారు. 

Also Read: Supreme Court: భార్యను బలవంతం చేసినా అత్యాచారమే.. అబార్షన్ చట్టబద్దమే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. 

Also Read: Smita Sabharwal : స్మితా సభర్వాల్ ట్వీట్‌ పై రచ్చ.. సారీ చెప్పి డిలీట్ చేసిన ఐఏఎస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News