Sankranthi Releases 2024 OTT Details: సంక్రాంతి అంతే చాలు సినీ ప్రేక్షకులకు బోలెడన్ని సినిమాలు వచ్చేస్తాయి. స్టార్ హీరోలు అయితే సంవత్సరం అంతా వెయిట్ చేసి సంక్రాంతికి తమ సినిమాని విడుదల చేయాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఈ సంవత్సరం సంక్రాంతికి కూడా దాదాపు నాలుగు తెలుగు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నాలుగు సినిమాల టీజర్లు ఇప్పటికే ప్రేక్షకులను విపరీతంగా మెప్పించి.. అంచనాలను భారీగా పెంచాయి. ఈ టీజర్లు చూసి ఈ సంక్రాంతికి రాబోతున్న నాలుగు సినిమాలు కూడా సూపర్ హిట్స్ అవుతాయి అని ప్రేక్షకులు అప్పుడే ఫిక్స్ అయిపోతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాగా ఈ సినిమాలన్నిటికీ ఇప్పటికే నాన్-థియేట్రికల్ బిజినెస్ ముగిసింది. శాటిలైట్, డిజిటల్ రైట్స్ రూపంలో అన్ని చిత్రాలు భారీగానే డబ్బులను మూట కట్టుకున్నాయి. ఇక ఎలా అయితే ఈ సంక్రాంతి విడుదలలో.. ప్రతి విషయంలో మహేష్ బాబు సినిమానే ముందుందో.. ఇక్కడ కూడా గుంటూరు కారం సినిమానే మొదటి స్థానంలో నిలిచింది.


గుంటూరుకారం సినిమా నాన్-థియేట్రికల్ బిజినెస్ ఏకంగా వంద కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. ముందు నుంచి ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ని తప్పకుండా 100 కోట్లకే అమ్మాలి అనుకున్న నిర్మాతలు.. అందరికీ అదే చెబుతూ వచ్చారు. ఒక దశలో జీ గ్రూప్ ఈ సినిమాను తీసుకుంటుందనే ప్రచారం జరిగింది. అయితే ఆఖరి నిమిషంలో జెమినీ టీవీ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ దక్కించుకుంది. ఇక నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రం ఓటిటి స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుంది. ఈ రెండు డీల్స్ తో పాటు, ఆడియో రైట్స్ తో కలిపి మేకర్స్, తాము అనుకున్న టార్గెట్ చేరుకున్నారు.


మహేష్ బాబు సినిమా తరువాత ప్రేక్షకులకు ఈ సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలలో ఎక్కువగా అంచనాలు ఉన్న చిత్రం హనుమాన్. ఈ సినిమాను జీ తెలుగు వారు సొంతం చేసుకున్నారు. ఈ సినిమా కంటెంట్ నచ్చి, ప్రశాంత్ వర్మపై నమ్మకంతో షూటింగ్ స్టేజ్ లోనే హను-మాన్ డీల్ జీ గ్రూప్ లాక్ చేసుకున్నట్టు సమాచారం.  ముందుగా శాటిలైట్ అనుకొని, ఆ తర్వాత డిజిటల్ రైట్స్ తీసుకొని, మరికొన్ని రోజుల తర్వాత కన్నడ, తమిళ్ నాన్-థియేట్రికల్ కూడా ఈ సంస్థ సొంతం చేసుకుంది. ఇందుకుగాను మొత్తం పైన 27 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు వినికిడి. మూవీకి బజ్ రాకముందు క్లోజ్ చేసిన డీల్ ఇది. ఇక టీజర్ విడుదలయ్యాక బిజినెస్ స్టార్ చేసి ఉంటే హనుమాన్ సినిమాకు కనీసం 50 కోట్లు వచ్చేవనేది ఇన్ సైడ్ టాక్.


సంక్రాంతికి విడుదలవుతున్న మరో చిత్రం వెంకటేష్  సైంధవ్. ఈ సినిమా సాటిలైట్ రైట్స్ పాపులర్ ఛానల్ ఈటీవీ వారు సొంతం చేసుకున్నారు. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది.
ఫైనల్ గా నాగార్జున నటించిన  నా సామి రంగా శాటిలైట్-డిజిటల్ రైట్స్ డీల్ కూడా మంచి అమౌంట్ సొంతం చేసుకుంది. ఈ సినిమా హక్కుల్ని స్టార్ మా, డిస్నీ హాట్ స్టార్ దక్కించుకున్నాయి. సంక్రాంతి బరిలో 14వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది.


ఇక తెలుగు చిత్రాలతో పాటు ఈ పండుగకు రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా రానున్నాయి. ఈ సినిమాలలో ఒకటైన అయలాన్ మూవీ శాటిలైట్ రైట్స్ ను జెమినీ టీవీ దక్కించుకోగా, స్ట్రీమింగ్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ చిత్రాలు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో తెలియాలి అంతే మాత్రం మరి కొద్ది రోజులు వేచి చూడాలి.


Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..


Also Read: Sneha: మోదరన్ డ్రెస్సులు స్నేహ…చెక్కుచెదరని అంటోన్న అభిమానులు


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook