Hebah Patel Steps Boss Party Song సోషల్ మీడియాలో బాస్ పార్టీ సాంగ్ వర్సెస్ జై బాలయ్య సాంగ్ ఎంతలా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ పాటల పోటీలో చివరకు దేవీ శ్రీ ప్రసాద్ నెగ్గాడు. తమన్ ఓడాడు. మొదటగా చిరంజీవి వాల్తేరు వీరయ్య నుంచి బాస్ పార్టీ అనే సాంగ్ వచ్చింది. ఆ పాటను రాసి బాణీ కట్టిన దేవీ శ్రీ ప్రసాద్‌ను దారుణంగా ట్రోల్ చేశారు. అయితే తమన్ కొట్టిన జై బాలయ్య పాట అయితే.. మరీ దారుణంగా ట్రోలింగ్‌కు గురైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒసేయ్ రాములమ్మ పాటను కాపీ కొట్టి జై బాలయ్యగా మార్చేయడంతో తమన్‌ను ట్రోల్ చేశారు. ఇక ఇప్పుడు బాస్ పార్టీయే దుమ్ములేపేస్తోంది. సోషల్ మీడియాలో చిరంజీవి పాటకే ఎక్కువ క్రేజ్ వచ్చేసింది. ఇప్పుడు ప్రతీ ప్రోగ్రాంలో బాస్ పార్టీ సాంగే వినిపిస్తోంది. తాజాగా హెబ్బా పటేల్ సైతం తన షూటింగ్ గ్యాప్‌లో బాస్ పార్టీ అంటూ స్టెప్పులు వేసింది.


 



అసలే ఇప్పుడు హెబ్బా పటేల్ మంచి జోరు మీదుంది. హెబ్బా పటేల్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఓటీటీ, వెబ్ సిరీస్‌, సినిమాలు అనే తేడా లేకుండా అన్నింట్లో దూసుకుపోతోంది. హెబ్బా పటేల్ నటించిన ఓదెల రైల్వే స్టేషన్ అందరినీ ఆకట్టుకుంది. ఆమె నటన, లుక్స్‌కు మంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ అనే సినిమాతో పలకరించేందుకు రెడీగా ఉంది.


అయితే ప్రస్తుతం హెబ్బా పటేల్ డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. బాస్ పార్టీ అంటూ చిరు స్టైల్లో స్టెప్పులు వేసింది హెబ్బా పటేల్. చిరు, ఊర్వశీ రౌతేలా స్టైల్లో హెబ్బా పటేల్ వేసిన చిందులు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. బాస్ పార్టీ మేనియా నెట్టింట్లో జోరు మీదుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


Also Read : Ariyana Glory Photoshoot : అంతా కనిపించేస్తోందిగా.. అరుపులు పుట్టించేస్తోన్న అరియానా


Also Read : Bigg Boss Vasanthi Kiss : గట్టిగా ముద్దు పెట్టేసిన వాసంతి.. దెబ్బకు అర్జున్ కళ్యాణ్‌ ఫిదా


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook