Bigg Boss Vasanthi Kiss : గట్టిగా ముద్దు పెట్టేసిన వాసంతి.. దెబ్బకు అర్జున్ కళ్యాణ్‌ ఫిదా

Bigg Boss Vasanthi Kiss to Arjun Kalyan బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలో వాసంతి అంతగా రెచ్చిపోలేదు. కానీ బయటకు వచ్చాక వాసంతి మాత్రం ముద్దులతో రెచ్చిపోతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 10, 2022, 04:55 PM IST
  • బిగ్ బాస్ కంటెస్టెంట్ల సందడి
  • అర్జున్ కళ్యాణ్‌కు వాసంతి ముద్దు
  • దెబ్బకు షాకైన యాంకర్ శ్రీముఖి
Bigg Boss Vasanthi Kiss : గట్టిగా ముద్దు పెట్టేసిన వాసంతి.. దెబ్బకు అర్జున్ కళ్యాణ్‌ ఫిదా

Bigg Boss Vasanthi Kiss to Arjun Kalyan బిగ్ బాస్ ఆరో సీజన్ కంటెస్టెంట్ల విషయంలో ఇప్పుడు అందరి భావన మారింది. సీజన్ స్టార్టింగ్‌లో ఏ ఒక్కరి గురించి అంతగా తెలియదు. కానీ బిగ్ బాస్ ఆరో సీజన్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చే సమయంలో మాత్రం అంతో ఇంతో క్రేజ్‌తోనే బయటకు వచ్చారు. కొందరు మాత్రం నెగెటివ్ ఇమేజ్‌తో బయటకు వస్తే.. ఇంకొందరు మాత్రం ఫుల్ పాజిటివ్ ఇమేజ్‌తో బయటకు వచ్చారు.

గీతూ, ఫైమా వంటి వారు ఫుల్ నెగెటివ్ ఇమేజ్‌తో బయటకు వచ్చారు. బాలాదిత్య, అర్జున్ కళ్యాణ్, వాసంతి వంటి వారు మాత్రం ఫుల్ పాజిటివ్‌తో బయటకు వచ్చేశారు. అర్జున్ కళ్యాణ్ అయితే సత్య వెనకాల పడి పడి జనాల దృష్టిలో సానుభూతిని సంపాదించుకున్నాడు. అర్జున్ కళ్యాణ్‌ ప్రేమను జనాలు అర్థం చేసుకున్నారు. కానీ సత్య ప్రవర్తన పట్ల మాత్రం జనాల అభిప్రాయం మారింది. ఒకప్పుడు ఉన్న సత్యకు.. ఇప్పుడున్న సత్యకు ఎంతో తేడా ఉందంటూ ట్రోల్స్ చేస్తుంటారు.

బిగ్ బాస్ టీఆర్పీల కోసం వాసంతి మాత్రం కాంట్రవర్సీలు క్రియేట్ చేసేందుకు ఏనాడూ ప్రయత్నించలేదు. తను ఎలా ఉంటుందో.. అలానే ఉంటూ వచ్చింది. తన అందంతో నెట్టుకొచ్చింది. బిగ్ బాస్ ఇంటికి గ్లామర్‌గా వాసంతి నిలిచింది. బిగ్ బాస్ ఇంటి నుంచి ఫుల్ పాజిటివ్ ఇమేజ్‌తో బయటకు వచ్చిన కంటెస్టెంట్లలో వాసంతి ఉంటుంది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్లతో శ్రీముఖి ఆట ఆడించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News